గ్రామ సుభిక్షం కోసం అమ్మవార్ల మహా జాతర

Jul 13, 2025 - 19:56
 0  11
గ్రామ సుభిక్షం కోసం అమ్మవార్ల మహా జాతర

చర్ల జులై 13 

చర్ల మండల పరిధిలోని గొంపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా ముత్యాలమ్మ తల్లి అమ్మవార్ల జాతర రంగ రంగ వైభవంగా, అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు శుక్రవారం, శనివారం, వందలాది మంది మహిళలు మేళ తాళాలతో,భాజ భజంత్రీలతో నీళ్ల బిందెలతో ఆలయానికి వెళ్లి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.చివరి రోజు అయిన నేడు ఆదివారం గ్రామ సరిహద్దుల్లో పొలిమేర స్తంభాలు ఏర్పాటు చేశారు.అనంతరం గ్రామంలోని గ్రామస్తులందరూ మేళతాళాలతో ఆలయం వద్దకు వెళ్లి ప్రసాదం నైవేద్యంగా పెట్టి, కోళ్లు,మేకలతో తమ మొక్కులుచెల్లించుకున్నారుఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, మాజీ వార్డు మెంబర్లు, మహిళలు, గ్రామస్తులు, పిల్లలు వేలాదిగా పాల్గొన్నారు.