అతివేగం వద్దు...ప్రాణం ముద్దు :ఎస్సై వెంకట్ రెడ్డి
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..
రహదారి భద్రత జీవితానికి రక్షణ...
నిబంధనలన్నీ నిండు ప్రాణాలు కాపాడందుకే ...!
మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు...!
ప్రమాదాల నివారణ లక్ష్యం....
తిరుమలగిరి 06 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి అన్నా రు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమలగిరి చౌరస్తాలో వాహనదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారో త్సవాలను ప్రతి ఏడాది నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెంట్ ధరించండి అలాగే వాహనాలలో ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకె ళ్లాలని చెప్పారు. కండీషన్‌లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్‌ఫోన్ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదని చెప్పారు. అనంతరం నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఏఎస్ఐ నికోలస్, హరిబాబు ,ప్రసాద్ , మురారి సైదులు , రమేష్ వాహనదారులు ప్రయాణికులు విద్యార్థులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు....