ఘనంగా రాచకొండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

Aug 23, 2024 - 08:53
 0  12
ఘనంగా రాచకొండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

*ఘనంగా రాచకొండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు*

*జనరల్ ఆసుపత్రి నందు రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ లో పాల్గొన్న వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ సభ్యులు*

పబ్లిక్ క్లబ్ ఇసి మెంబర్, వాసవి క్లబ్ ఐపిసి కోఆర్డినేటర్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి నందు రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి డైరెక్టర్ మీలా వాసుదేవ్ మాట్లాడుతూ రాచకొండ శ్రీనివాస్ లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఏరియా ఆసుపత్రి నందు 365 రోజుల పాటు ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. మున్ముందు మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్, వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, క్యాబినెట్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుడిపూడి వెంకటేశ్వర రావు, మిర్యాల వెంకటేశ్వర్లు, బుద్ద శ్రీనివాస్ గుప్త, బెజగం ఫణి కుమార్, బజ్జూరి శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223