ఘనంగా యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు జన్మదిన వేడుకలు
సూర్యాపేట: యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని రెడ్ హౌజ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి, పోతు భాస్కర్, ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.