ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Jul 19, 2024 - 10:11
 0  6
ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

*- ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

  • పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు*
  • పెన్ పహాడ్ తెలంగాణ వార్త
  • పెన్ పహాడ్ మండల కేంద్రంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా దొంగరి యుగంధర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవ చేయాలన్నదే జగదీష్ రెడ్డి లక్ష్యమని ఆయన నుంచి నేర్చుకున్న దానిలో భాగంగానే ఈ రోజు పేషెంట్లకు పండ్లు పంపిణి చేయడం జరిగిందని అన్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. 10 ఏళ్లపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజలందరి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దొంగ యుగేందర్ మాజీ జెడ్పిసి మామిడి అనిత అంజయ్య , సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి మరియు పార్టీ సీనియర్ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు బిట్టు నాగేశ్వరావు, పొదిళ్ల నాగార్జున ,నల్లపు శ్రీనివాస్ , ఉర్లుగొండ రాధాకృష్ణ , బాదే ధర్మయ్య , మీసాలదేవయ్య, లెక్కపాక నరసయ్య, వై జగన్, కొండేటి సతీష్, సద్దల వంశీ, కొండేటి అశోక్ రెడ్డి, సద్దల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State