సూర్యాపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..
సూర్యాపేట,18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రజా పాలన - ప్రగతి పాలనలో భాగంగా సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ వి.సునీత ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పబ్లిక్ స్కూల్ నందు విద్యార్థులకు రోడ్డు భద్రతపై 'ఎస్సే రైటింగ్' (వ్యాసరచన) పోటీలు మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. అర్రివ్ అలీవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సూర్యాపేట టూ టౌన్ ఎస్.ఐ శివతేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ముఖ్యంగా విద్యార్థులు చిన్నతనం నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు ప్రసన్న మరియు ధనుశ్రీలను ఎంపిక చేసి, ఎస్.ఐ చేతుల మీదుగా వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) బి. సైదులు, ఆర్టీసీ సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందాన్నారు.