మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చే కుట్ర కందుకూరి లక్ష్మయ్య

Dec 17, 2025 - 21:21
 0  104
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చే కుట్ర కందుకూరి లక్ష్మయ్య

నిరుపేదల ఉపాధి హామీ పథకాన్ని.....సాధారణ పథకంగా మార్చే కుట్ర. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మీడియా కన్వీనర్ల కందుకూరి లక్ష్మయ్య

 

 తిరుమలగిరి 18 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలలోని పల్లె గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పనుల ద్వారా ఉపాధి పొందుతున్న తరుణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం తేవాలనుకుంటున్న విబి.. జిరామ్.. జి చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మీడియాఇన్చార్జ్ కందుకూరి లక్ష్మయ్య పత్రికా సమావేశంలో మాట్లాడుతూ చట్టబద్ధత హక్కుల ఆధారిత వ్యవస్థను బడ్జెట్ పరిమితిలతో సాధారణ పథకంగా మార్చే కుట్ర జరుగుతుంది. చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను కేంద్రానికి ఎలాంటి జవాబుదారితనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చాలనుకోవడాన్ని ఖండిస్తున్నాం. ఈ బిల్లులోని సెక్షన్ 5...( 1) ప్రకారం కేంద్రం ఒకవేళ ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిపై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి హక్కుగా లభించదు. ప్రస్తుత ఉపాధి హామీ చట్ట స్వభావం మౌలిక లక్ష్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. విబి.. జిరామ్... జి అనేది గ్యారంటీ లేని ఒక పథకంగా మారనుంది. పేరులో గ్యారెంటీ ఉన్నప్పటికీ ప్రతిపాదిత చట్టంలో నిజమైన హామీ లేదు. ఈ స్కీము ఎక్కడ అమలు అవ్వాలి ఎన్ని నిధులు ఇవ్వాలి ఏ ఏ పనులు చేపట్టాలి వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఖర్చును మాత్రం రాష్ట్రాలపై మోపాలనుకుంటుంది. కావున ఉపాధి హామీ పేరును తొలగించడం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపికి తగదని రాష్ట్రంలోని మేధావులు నాయకులు పేద ప్రజల కోసం గత కొన్ని సంవత్సరాల నుండి ఉపాధి హామీ పేరును ఈరోజు పేరును మార్చాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు ఆనాడు ఉద్యమకారులు విప్లవకారులు సోషలిస్టు నాయకులు ఎంతో మంది పోరాటం చేస్తే ఆనాడు ఉపాధి హామీ పనిని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి హమీషా కుట్రలతో కొన్ని రాష్ట్రాల పేద ప్రజలపై భారం మోపడం చట్టరీత్యా నేరంగా ప్రభావితం అవుతుంది కావున ఉపాధి హామీ పేరును మార్చాలని చూస్తే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మాయమవుతుందని మిత్రపక్షాలు సోషలిస్టు పార్టీలు ఇండియా కూటమిలాంటి పార్టీలు ఈ కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను మానుకోవాలని హెచ్చరిస్తూ కేంద్రంపై అన్ని పార్టీలతో పోరాటానికి సిద్ధమన్నారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పేదలపై భారం మోపుతున్నారు అన్నారు. ఈరోజు ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్. పోస్టల్ ఇంకా పరిశ్రమలు వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ అంబానీ లాంటి వారికి ఆదాని వారి లాంటి వారికి ధారా దత్తం చేస్తూ వారు మూడవ పర్యాయం కూడా దేశంలో బిజెపి పార్టీని తేవడానికి లక్షల కోట్ల డబ్బులను రక్షించి కొన్ని రాష్ట్రాల నాయకులను కొనుగోలు చేసి ఓటు చోరీతో ఎన్నో మిషన్లను తారుమారు చేస్తూ దొంగ ఓట్లతో రాష్ట్రాలను ఏలుతూ అన్ని దేశాలతో సంబంధాలు మెరుగు పరుచుతున్నామని ఇప్పటికీ మన దేశ ప్రధాని 90 దేశాలు తిరిగివచ్చాడు. అయినా మన తెలంగాణకు పార్లమెంటులో నిధులు ఇవ్వకుండా అరకొర నిధులతో ప్రచారం చేస్తూ సంవత్సరాలు గడిచిన నిధులు ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కేసులలో ఇరికిస్తూ సిబిఐ సిఐడి అంటూ ప్రతిపక్ష నేతలను ఇరుకునపెట్టి ఇబ్బందులతో పార్టీ మార్పిడి చేసుకుంటూ వారి పార్టీలో కలుపుకుంటున్నారు. ఇలా చేయడమే తప్ప కేంద్రంలో బిజెపి పార్టీ మన తెలంగాణకు చేసింది ఏమీ లేదు. మన తెలంగాణ బిజెపి కేంద్రమంత్రులు రాష్ట్ర నాయకులు ఏ జిల్లాలకు ఎన్ని నిధులు తెచ్చారో గుండె మీద చెయ్యేసి చెప్పాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు స్థానికంగా జరగాల్సిన ఉపాధి ప్రణాళిక రూపకల్పనను కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చాలనుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ హాజరు ఆధార్ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టడం వల్ల ఎందరో కార్మికులు ఉపాధికి దూరమయ్యారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కొత్త బిల్లులో ఏకంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ జియో.. స్పెషల్ టెక్నాలజీ వాడకాన్ని తప్పనిసరి చేయాలనుకోవడం కార్మికులపై మరింత నిగాపెట్టడమేనని విమర్శిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధానం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అనేక నివేదికలు స్పష్టం చేశారని సామాజిక ఉద్యమకారులు గుర్తు చేస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి