గుర్రంగడ్డ గ్రామ అభివృద్ధి కోసం మా పూర్తి సహకారం ఉంటుంది

Sep 2, 2024 - 19:32
Sep 2, 2024 - 19:35
 0  38
గుర్రంగడ్డ గ్రామ అభివృద్ధి కోసం మా పూర్తి సహకారం ఉంటుంది
గుర్రంగడ్డ గ్రామ అభివృద్ధి కోసం మా పూర్తి సహకారం ఉంటుంది

జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.

గద్వాల్:-గుర్రంగడ్డ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించి, సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.సోమవారం గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామాన్ని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తో కలిసి జిల్లా కలెక్టర్ బోటు ద్వారా సందర్శించారు.కృష్ణా నదికి మధ్యలో ఉన్న ఈ ద్వీపం గ్రామానికి చేరుకొని, గ్రామం అంతా తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుర్రంగడ్డ గ్రామ అభివృద్ధి కోసం మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. మీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వాటి పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు.                            గుర్రంగడ్డ గ్రామం రవాణా సౌకర్యాల లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న  సమస్యను త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు  తీసుకొని, మీకు సురక్షితమైన రవాణా సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని  అన్నారు. గ్రామంలో కరెంటు కొరత లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామంలోని రహదారులు వాటిని త్వరలోనే బాగు చేస్తామని అన్నారు. గ్రామంలోని చిన్నారుల భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రంలో టీచర్ ను త్వరలోనే నియమిస్తామని, గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే సబ్ సెంటర్ కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని అన్నారు. గ్రామంలోని ఇసుక రీచ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో  పరిశుభ్రత తో పాటు, అన్ని సమస్యలను ఎం.పి.డి.ఓ  నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామo లో శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.గ్రామ ప్రజలకు నిత్యం పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ -100 లేదా గద్వాల్ రూరల్ పోలీస్ వారికి సమచారం అందించాలని మరియు వరదలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామస్థులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా  చూసుకోవడం జరుగుతుందని అన్నారు. పోలీస్ సిబ్బంది కూడ గ్రామస్థులతో రేగులర్ గా కాంటాక్ట్ లో ఉంటూ ఎప్పటికప్పుడు గ్రామ పరిస్థితులను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.గుర్రంగడ్డ గ్రామం సందర్శన అనంతరం, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ బోటు ద్వారా తిరిగి బీచ్ పల్లి వరకు ప్రయాణం చేశారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ తహసీల్దార్  కర్ణాకర్, డి.యం.హెచ్.ఓ సిదప్ప, గద్వాల్ ఇంచార్జి సిఐ నాగేశ్వర రెడ్డి, రూరల్ ఎస్సై శ్రీకాంత్ డాక్టర్ ఏంజెల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333