గుణపాఠం తప్పదు బి ఆర్ ఎస్, బి జె పి పార్టీలకు అనంతుల నరేందర్, లింగరావు
తెలంగాణ వార్త కొండపాక:- కొండపాక ఏప్రిల్ 19 పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్ కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు వాసరి లింగారావు అన్నారు. శుక్రవారం కొండపాక మండలం వెలికట్ట క్రాస్ రోడ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆరు గ్యారంటీ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలుస్తున్నాయన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేంద్రంలో బిజెపి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నిరుద్యోగ సమస్య తీర్చ లేదన్నారు. ఈ రెండు పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు ఆకర్షితులై ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి తీరుతుందన్నారు. మెదక్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిరావాలని కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పుల మల్లేశం, మల్లికార్జున్ మాదిగ , వెంకటరమణ, శ్రీకాంత్ గౌడ్, వెంకటేశం, వెంకట్ గౌడ్, అఖిల్ తదితరులున్నారు.