అభుజా సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
రామాన్నపేట 04 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో కొమ్మాయిగూడెం రామన్నపేట రైల్వే స్టేషన్ వెనుక రైతులకు అబద్ధాలాడి రైతుల దగ్గర నుండి భూమి 360 ఎకరాల కొనుగోలు చేసి రామన్నపేట మండలం గ్రామ ప్రజలందరికీ కాలుష్యం ఊబిలో ముంచడానికి ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతుంది.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ వల్ల రామన్నపేట మండలం అన్ని గ్రామాలలో ప్రజలను చంపడానికి సిద్ధంగా ఈ ఫ్యాక్టరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీ పెట్టడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.ఈ రామన్నపేట మండలంలో మరొక వికలాంగులను పుట్టించడానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి గత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలియో బాధలలో పడి ఉమ్మడి జిల్లాగా పేరు పొంది ఉన్నది.ఈ ఉమ్మడి జిల్లాలో చాలా అవస్థలు పడి ఉన్న వికలాంగులు పోలియో ఇబ్బంది వల్ల ఇప్పుడిప్పుడు తగ్గి ముఖం పడుతుంటే మరొక ఇషా కాలుష్యం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాక్టీ పెట్టడానికి ఆమోదించింది ఇది ఒక మనిషే కాదు అక్కడ ఉన్న అన్ని రకాల జీవరాశులకు పంట పొలాలకు పశువుల,మేకల గొర్లకు మొత్తం జీవిస్తున్న వృక్షాలకు ప్రమాదకరణంగా ఉన్న ఈ కాలుష్యాన్ని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే వెనకకు తీసుకోవడానికి ఈనెల 23 తారీకున ప్రజాభిప్రాయ సేకరణకు ముందే వెంటనే ఎనుకకు తీసుకోకపోతే రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వికలాంగులు ప్రజలు కన్నెర్ర చేస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాడి మసైపోతారు అందుకోసం ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పటికైనా కన్నులు తెరిచి రామన్నపేట మండలం పరిధిలో ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నామని జిల్లా అధికారుల కలెక్టర్ ద్వారా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేశామని ఒక ప్రకటనలో వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి మండల అధ్యక్షులు బలుగూరి ఆంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి గిరకల్ లింగస్వామి, ఉపాధ్యక్షులు నాగు నరసింహ, ఎం కృష్ణ పున్న శ్రీధర్,టి యాదగిరి,పరశురాములు తదితరులు పాల్గొన్నారు.