గద్వాల జిల్లాకే పేరుతెచ్చిన నిరుపేద కుటుంబం నుంచి 994 మార్కులు ఎ.రాజు అద్భుత విజయం.
ఇంటర్ బైపీస్ లో 994 మార్కులు సాధించిన ఎ. రాజు గద్వాల యువకుడి ఘనత.
జోగులాంబ గద్వాల 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- -పేదరికాన్ని జయించి టాప్ స్కోర్ ట్రినిటీ కాలేజీ విద్యార్థి ఎ.రాజు 994 మార్కులతో :ఇంటర్మీడియట్ ఏప్రిల్ 12వ తారీఖున ఆదివారం ఫలితాలు వెలువడగా ట్రినిటీ కళాశాలలో ఇంటర్ బైపీసీలో ప్రభంజనం సృష్టించిన ఏకైక విద్యార్థి ఎ.రాజు.ప్రతిభకు పేదరికం అడ్డుకాదని మరోసారి నిరూపించాడు. కరీంనగర్ జిల్లాలో ట్రినిటీ కళాశాలలో విద్యార్థి ఎ.రాజు ఇంటర్మీడియట్ బైపీసీలో 1000 మార్క్ లకు గను994 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ సత్తా చాటి కనబరిచాడు.విద్యార్థి యొక్క పూర్తి బయోడేటా జోగులాంబ గద్వాల జిల్లా,గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన డేవిడ్ శారద దంపతులకు ముగ్గురు సంతానం రెండవ సంతానం ఎ.రాజు నిరుపేద కుటుంబంలో జన్మించాడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా,తన కృషి పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టి ఈ గొప్ప విజయాన్ని అందుకున్నాడు.రాజు సాధించిన ఈ ఫలితంపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అతని విజయాన్ని చూసి ఇతర విద్యార్థులు కూడా ప్రేరణ పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో డాక్టర్‌గా మారి ప్రజలకు సేవ చేయాలని రాజు లక్ష్యంగా పెట్టుకున్నాడు.
994 మార్కులతో మెరిసిన ట్రినిటీ కాలేజీ విద్యార్థి ఎ.రాజు. ""ఎ.రాజు మాట్లాడుతూ, పరిస్థితులు ఎలా ఉన్నా కష్టపడి చదివితే తప్పకుండా ఫలితంవస్తుంది.నాతల్లిదండ్రుల ఎంతో కష్టాలలో ఉన్న నన్ను చదివిస్తున్నారు నా గురువులు,తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించాను పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు నాగురి నా లక్ష్యం ఒక్కటే మంచి డాక్టర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని నా తల్లిదండ్రుల ఆశయం అని తెలిపారు. "కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..ఎ.రాజు మా కాలేజీ కి ఎంతో మంచి పేరు తెచ్చినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది అతని కృషి,క్రమశిక్షణ ఇతర విద్యార్థులకు ఆదర్శం అని తెలిపారు. ""గ్రామస్తులు మాట్లాడుతూ..మా గ్రామానికి చెందిన ఎ.రాజు ఇంత మంచి మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉంది.ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని గ్రామస్తులు బందువులు కోరుకుంటున్నారు.