గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందించిన క్రీడాకారులు

Apr 17, 2026 - 18:45
Apr 17, 2026 - 19:54
 0  1
గ్రామపంచాయతీకి ఫ్రీజర్  బాక్స్ అందించిన క్రీడాకారులు

17-04-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం :  చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో జి పి ఎల్ 5 క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులు అందరూ కలిసి గ్రామానికి గొప్ప మనసుతో ఫ్రీజర్ బాక్స్ ను సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.

 యువత మాట్లాడుతూ మన గ్రామంలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎక్కడికో వెళ్లి కిరాయి పెట్టి ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకోకుండా మన గ్రామం కాడికి అందరూ కూడా ఫ్రీగా వాడుకోవచ్చని మేము క్రీడాకారులమంతా ఆలోచింపజేసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగినది అని అన్నారు.

 సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో యువతీ యువకులు ఏకతాటిపై నడిచి మీ యొక్క విద్యాబుద్ధితో గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చు అని యువతీ యువకులను సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి అభినందించారు.

 ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి తో పాటు వార్డ్ నెంబర్లు మోసమోని శివ, గొందిపర్ల బాలకృష్ణ, పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, గ్రామ పెద్దలు క్యాథూరి రాముడు,సింగోటం బాలస్వామి, రొడ్డ బిచ్చన్న, కొత్త సత్యమయ్య, చిన్న నరసింహ, రోడ్డ వెంకటయ్య. బీరయ్య 

 యువత భగవాన్ సాగర్, బత్తుల చంద్రశేఖర్,రాజకుమార్, బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State