క్రైస్తవ పితామహుడు విద్యావేత్త. డాక్టర్ విలియం కేరి
భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివి
క్రైస్తవ పితామహుడు విద్యావేత్త డా. విలీయం కేరి భాతదేశానికి చేసిన
సేవలు మరువలేనివి* బిషప్ దుర్గం ప్రభాకర్
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
శనివారం 17 ఆగస్టు : కోదాడ పట్టణం,మతానగర్ బి. సి. యం. కల్వరి వెలుగు చర్చ్ పాస్టర్ మాడ్గుల సుందర్ రావు ఆధ్వర్యంలో క్రైస్తవ పితామహుడు డా.విలీయం కేరి 263 వ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ భారత దేశం నిర్మాణం నకు రూపాశిల్పి, ఆధునిక క్రైస్తవ ఉద్యమానికి పితామహుడు, తన జీవితమే ఒక సువార్త గా, డా విలియం క్యారీ ఆగష్టు 17, 1761 - జూన్ 9, 1834 ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త. తెలుగుభాషకు 'ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్' అనే పేరుతో 1814లో ఇంగ్లీషు వ్యాకరణం రచించిన వ్యక్తి అతను ఆంగ్లంలోకి రామాయణాన్ని అనువదించాడు.
క్యారీ 1793లో కలకత్తా చేరుకున్నాడు. 1800 సం.లో కలకత్తా సమీపంలో శ్రీరామపూర్ లో బాప్టిష్టు మిషన్ నెలకొల్పడు. ఇది బెంగాలు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్య సంఘటన,ఈ మిషన్ వారు పాఠశాలలు స్థాపించి భారతీయులకు ఇంగ్లీషునేర్పారు.మొదటి న్యూస్ పేపర్ పెట్టిన వారు, బ్యాంక్ లు, పోస్ట్ ఆఫిస్ మొదట గా పెట్టటమే కాకా,ఒకప్పుడు సతీసహగమనము సంఖ్య అధికం కాగా ఆవిషయం పై ఉద్యమం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆపిన గొప్ప వ్యక్తి. రాజా రామమోహనరాయ్ సందర్శించగా క్యారీ ఆయనకు సగౌరవంగా స్వాగతం చెప్పి, బైబిల్ ప్రతిని ఆయనకు కానుకగా ఇచ్చాడు. స్కూల్ అభివృద్ధికోసం రామమోహనరాయ్ గారు కొంత స్థలాన్ని దానంగా ఇచ్చారు.క్యారీ 1801లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజీలో బెంగాలీ సంస్కృతశాఖల అధిపతిగా నియమితుడైనాడు. ఆ రోజులలో ఆ కాలేజీ వివిధ యూరప్ పండితులు, భారతీయ విద్వాంసులూ కలుసుకొనే విద్యాకేంద్రంగా వాసికెక్కింది. వారి సహకారంతో క్రైస్తవమత గ్రంధాలను ప్రధానమైన భారతీయ భాషలలోకి అనువదించాలని క్యారీ తలపెట్టాడనీ.వీరు 1808లో న్యూటెస్ట్ మెంట్ ను సంస్కృతంలో ముద్రించారనీ . 1883 నాటికల్లా బైబిలు 33 భాషలలోకి అనువదించబడినదనీ .డా విలీయం క్యారీ క్రైస్తవ మతగ్రంధాలలోను జ్ఞానమును వ్యాప్తి చేయడానికి ఎక్కువ కృషిచేసాడనీ" అన్నాడు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా సి సి టి చైర్మన్, క్రైస్తవ నాయకులు పోకల అశోక్, కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు రెవ. డా. వి. యెషయా, సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. ఇంజమూరి గాబ్రియేల్,చార్లెట్ హోం ఆనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, హుజూర్నగర్ సీనియర్ పాస్టర్ మాతంగి ఎలీషా,పాల్వాయి అజయ్,యువ నాయకులు మాడ్గుల రాహుల్ (గుండు)పాస్టర్ స్టేపెన్ పాల్, గంధం పాండు,నీలి హేమంత్,సంపత్, సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు.