స్థానిక ఎన్నికల ముందే కుల గణన డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్
స్థానిక ఎన్నికల ముందే కుల గణన
డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్.
హైదరాబాద్ 8 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం నలుగురు సభ్యులతో సామాజిక న్యాయం పాటిస్తు కమిషన్ ఏర్పాటు చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు హర్షం వ్యక్తం చేశారని డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అన్ని కులాలను సమన్వయ పరుస్తు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంతో మహిళలందరు బస్సు సౌకర్యం వినియోగించుకుంటున్బారని అన్నారు. విద్యుత్, గ్యాస్ సబ్సిడిలను ఉపయోగించుకుంటున్నారని మరియు రైతులకు ఆగస్టు 15 లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల కాలంలోనే అన్ని కులాలకు కార్పొరేషన్లు చైర్మన్ లను సభ్యులను నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేసిందని గుర్తు చేశారు. గత టిఆర్ ఎస్ ప్రభుత్వం రెండు ఎమ్మెల్సీల పదవి చెల్లదని కోట్లు మెట్లు ఎక్కి కోర్టులో కేసు వేసిన అనతి కాలంలోనే కోర్టు వారికి చెంప చెల్లుమనిపించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులను, ఎంపిలను ,ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ప్రభుత్వ విప్పులను సమన్వయపరచుకొని పాలన దిశగా అడుగు వేస్తున్నారని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పాలన సాగిస్తున్బారు.
తెలంగాణలో అనతి కాలంలోనే స్థానిక ఎన్నికల నిర్వహించి ఎన్నికల ముందే కులగణన చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు .అందుకనే రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా గోపి శెట్టి నిరంజన్ సభ్యులుగా రాపాలు జయ ప్రకాష్,తిరుమలగిరి సురేందర్ ,బాల లక్ష్మిలను నియమించడం చాలా సంతోషం అని తెలిపారు.
జనాభాలో మెజార్టీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారు. పంచాయతీ ఎన్నికల ముందే కులగణన చేసి ఎన్నికలకు వెళుతుందని ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం కులగణన చేసి స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ చేసి పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని దాని మూలంగా బిసి కులాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు.