కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కానీ హక్కు గాని B R S నాయకులకు లేదు

Jan 30, 2025 - 20:28
Jan 30, 2025 - 20:54
 0  9
కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కానీ హక్కు గాని B R S నాయకులకు లేదు

*కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే స్థాయి కానీ హక్కు గాని BRS నాయకులకు లేదు*

కన్నాయిగూడెం  తెలంగాణ వార్త జనవరి 30:

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క  ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న సూచనల మేరకు కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం లో *కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎం డి. అప్సర్ పాషా, & మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు గార్లు* మాట్లాడుతూ ఈ రోజు పనికట్టుకోని BRS పార్టీ నాయకులు ఎక్కడికక్కడ గాంధీ విగ్రహాల దగ్గర వినతి పత్రాలు అందజేయడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లు ఏకదాటిగా పాలించిన BRS పార్టీ కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చెయ్యడం తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదు 

బంగారు తెలంగాణ చేస్తా అని అప్పుల తెలంగాణ చేసిండు  దళిత ముఖ్యమంత్రి అని మాట చెప్పి తీరా గెలిసాక సీటు నాదే సీఎం నేనే అని దొర మాట తప్పి గద్దేనెక్కి దళితులను మోసం చేసిండు 

????????రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇస్తా అని చెప్పి అరకొరగా కట్టి చేతులు దులుపుకున్న ఘనత కెసిఆర్ ది కాదా 

????????రైతన్నలకు ఉచితంగా ఎరువులు యూరియా పంపిణీ చేస్తా అని రైతన్నల నడ్డి విరిచిన చరిత్ర మీది కాదా 

????????ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా పరీక్షలు రాసిన వారి పేపర్ లీకేజీ లు చేసింది కెసిఆర్ ప్రభుత్వం కాదా 

????????లక్ష్మ రుణమాఫీ హామీ పేరుతో ఎలక్షన్ లో గెలిచి 10 ఏండ్ల తర్వాత 1 లక్ష రుణమాఫీ చేస్తే బ్యాంకు లో వడ్డీకి కూడా సరిపోలేదు రైతన్నలకు అందరికీ కూడా మాఫీ జరగలేదు దీనికి కారణం BRS ప్రభుత్వం కాదా 

????????10 ఏండ్ల కాలంలో ఒక్క గ్రామ సభ పెట్టకుండా 

ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా చేసింది మీరు మీ ప్రభుత్వం కాదా 

????????దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 100 ల ఎకరాలు కొల్లగొట్టింది మీరు కాదా 

????????ధరణి పేరుతో వేల ఎకరాలు లక్షల కోట్లు సంపాదించుకున్నది మీ BRS పార్టీ నాయకులు KTR హరీష్ రావులు కాదా 

????????కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పింది మీ బాపు కెసిఆర్ కాదా 

????????విద్యార్థులకు ఫీజు రియాంబెన్స్ మెంట్ ను బందు చేసింది మీ BRS ప్రభుత్వం కాదా 

????????భారీ ప్రాజెక్ట్ ల పేరుతో లక్షల కోట్లు వెనకేసుకున్నది నిజం కాదా 

ఇట్ల చెప్పుకుంటూ పోతే మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యని అసమర్ధత పార్టీ పాలన మీది 

ప్రజాపాలన లో ఈ రోజు నిజమైన పేదలకు అర్హులకు గ్రామ సభల ద్వారా ప్రభుత్వ పథకాలు అందుతుంటే ప్రజలకు దగ్గర అవుతున్నారనే కుట్రతో స్థానిక ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా రాధనే భయంతో ఇప్పుడు కావాలని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుంటూ ఈ BRS పార్టీ నాయకులు పబ్బం గడుపుతున్నారన్నారు 

నిజమైన పాలన ఏంటో ఈ ఒక్క సంవత్సరం లోనే తెలిసిందని అన్నారు 

*మీలాగా మేము రైతు బంధు ను చెట్లకు గుట్టలకు కొండలకు, సినిమా హళ్లకు కాకుండా నిజమైనా రైతు కు *భూమి ని సాగుచేసుకుంటున్న పంట వేస్తున్న రైతన్నకు ఇస్తున్నామన్నారు* 

*ఒక్కో కుటుంబానికి 200 యూనిట్ల* *ఉచిత విద్యుత్ ని* 

*మరియు అర్హులైన ప్రతి* *కుటుంబానికి రేషన్ కార్డు లు* 

*ఇల్లు లేని పేదలను గ్రామ సభల ద్వారా గుర్తించి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని అన్నారు* 

*మీ 10 ఏండ్ల పాలన కాలంలో చెయ్యలేని అభివృద్ధి ని ఒకటే సంవత్సరంలో చేశామని ఇంకా 4 ఏండ్ల కాలంలో చాలా చేసి చూపిస్తామని అన్నారు.*

ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్