ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానం డి.ఎస్పి
తిరుమలగిరి 25 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ (CCTV) కెమెరాలను గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ అధికారులు, గ్రామ ప్రజలు పోలీసు అధికారులతో కలిసి సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాలతో గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చర్యలు తీసుకుని గ్రామస్థుల సహకారం, గ్రామ సర్పంచ్ సహకారంతో ప్రారంభించాము అన్నారు. ఈ కెమెరాలు గ్రామానికి ఒక రక్షణ వలయంగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ 12 సీసీటీవీ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానించామని, వీటి ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఒక్కో కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, గ్రామంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు లేదా నేరాలు జరిగినా ఈ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అవుతాయని ఆయన హెచ్చరించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు నేరాల్లో సాక్ష్యాలుగా ఉంటాయి కోర్టుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. గ్రామంలోకి ఎవరు వచ్చి వెళుతున్నారు అనేది గుర్తించవచ్చు అన్నారు.
గ్రామంలోని యువత అసాంఘిక చర్యలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మన సమాజాన్ని, మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు, గంజాయి మత్తు పదార్థాలకు బానిశలైతే జీవితం నాశనం అవుతుంది అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతాం అని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. అదేవిధంగా, గ్రామాల్లోని రైతులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నకిలీ విత్తనాల పరమపత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం వారు సామాజిక అంశాలైన రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాలు, డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత మరియు యువత భవిష్యత్తుపై తమ ఆటపాటలతో గ్రామస్తులకు ఎంతో చక్కగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సీఐ నాగేశ్వరరావు, ఎస్సై వెంకట్ రెడ్డి తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ కిషన్, గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.