ఏడాదిలో సర్కారు పతనం అన్నందుకు  బారాసపై  దేశద్రోహ కేసు పెట్టాలి

Apr 25, 2024 - 22:53
Jun 27, 2024 - 20:34
 0  1
ఏడాదిలో సర్కారు పతనం అన్నందుకు  బారాసపై  దేశద్రోహ కేసు పెట్టాలి

సుల్తాన్పూర్ సభలో మాట్లాడిన  మొరటు దుర్భాషలపై

న్యాయ వ్యవస్థ సుమోటో గా స్వీకరించాలి.

రాజకీయాల్లో ఏ పార్టీ కూడా చౌకబారు మాటలు మాట్లాడకుండా కట్టడి చేయాలి.

పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటు వేయమని కోరడమంటే 

తిరిగి పదేళ్ల  విధ్వంస పాలనను కోరుకోవడమే.

----వడ్డేపల్లి మల్లేశం

గత పదేళ్లుగా రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో  ఆర్థిక విధ్వంసం,  అసమానతలు,  వివక్షత , పేదరికము, ఉపాధి లేక ఉద్యోగాలు కానరాక, పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్వీర్యమై,  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, మద్యపానంతో రాష్ట్రమంతా  అధోగతి పాలైన విషయం తెలిసిందే . మరొకవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా  కేవలం పెట్టుబడిదారులు సంపన్న వర్గాలు భూస్వాములకు మాత్రమే  పనిచేసినటువంటి  brs కు పార్లమెంటు ఎన్నికల్లో ఓటేయాలని  ఏడాదిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని  తర్వాత వచ్చేది మనమేనని ప్రజలతో నమ్మబలికే ప్రయత్నం చేస్తే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు అని గుర్తించాలి . మాటల గారడి  ఇతర కారణాలతో వేలాది సంఖ్యలో ప్రజలు సభలకు వచ్చినప్పటికీ ప్రజలు తమ ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకున్న విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది.  ప్రతిపక్ష పార్టీగా నిర్ణయాత్మక పాత్ర పోషించకుండా ఇష్టం ఉన్నట్లుగా బూతు మాటలు,  లిల్లీపుటిగాళ్లు,  తెలివిలేని ధద్ద మ్మలు, అవగాహన లేదు, పిచ్చోళ్ళు,  తెలివి ఉన్నదా,  జ్ఞానం లేదు  వంటి అనేక పదాలను  టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిరోజు మాట్లాడడం మంత్రులు ఎప్పటికీ ఇదే వాగ్దాటిలో  ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టడం సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని మార్చుకోకపోతే ప్రజలు, న్యాయ వ్యవస్థ కూడా తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని గుర్తించడం అవసరం
 
   సుల్తాన్పూర్ సభలో మాట్లాడిన తీరు:-

  గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే  ప్రజా ఆశీర్వాద సభల పేరుతో  టిఆర్ఎస్ కొనసాగడమే మొదలు  అభ్యంతరకరం.  ఇక మంత్రులు అధినేత కూడా ప్రజలను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం  ప్రజాస్వామిక రాజ్యాంగ విధానాలకు పూర్తిగా విరుద్ధం . అవసరమైతే పోలీసులు అలాంటి సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీ మాట్లాడిన కేసులు పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది.  "ప్రజలు ప్రభుత్వం పైన థీ రుగ పడుతున్నారు  ఎప్పుడు ఏ పార్టీ మారుతాడో చూద్దాం,  అయినా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు,  మేము టిఆర్ఎస్ పాలనలో ప్రజలను కాపాడుకున్నాము,  రైతులను కాపాడుకున్నాము,  తెలంగాణ సాధించినట్లుగానే  మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాధిస్తా,  ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్కు చురుకు పెట్టాలి,  

 బిజెపి కూడా అక్కరకురాని చుట్టమే, ఆ పార్టీకి ఓట్లు వేస్తే మంజీరా నదిలో పడవేసినట్లు  "అంటూ అసంబద్ధమైన మాటలు మాట్లాడడం   ప్రజాస్వామ్య ప్రక్రియలో మంచిది కాదు.  ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది కేవలం టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడాన్ని మానుకోవాలి అని అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విశ్లేషకులు ఎప్పుడో బల్లగుద్ది చెప్పారు.  1994 ప్రాంతంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైనదని వందలాదిమంది కార్యకర్తలు,  మలిదశ ఉద్యమంలో 1400 మంది అమరులైన విషయాన్ని,  19 69 లో తొలి దశలో 370 పైగా  ఆత్మ బలిదానాలు చేసుకున్న విషయాన్ని ఇప్పటికి టీఆర్ఎస్ గుర్తించకపోతే ఎలా? అని  ఆ వర్గాలు సీరియస్ అవుతున్నారు. అలాంటప్పుడు తెలంగాణ సాధించినాము అనే ఆస్కారమే లేదు.  ఇక అలాంటప్పుడు మళ్ళీ తిరిగి తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాధిస్తాం అంటే  గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనను ప్రజలు తిరస్కరించిన తర్వాత  ఓట్ల అడిగే అవకాశం లేదు. కొంతకాలం వేచి తప్పులను సవరించుకోవాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ  బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యమంత్రిని మంత్రులను  చౌకబారు మాటలు మాట్లాడడం సరైనది కాదు. వెంటనే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని ఇలాంటి మాటలను రికార్డులు తెప్పించుకొని  తగిన శిక్ష వేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే తెలంగాణలో ప్రత్యేకమైన ప్రశాంతమైన పాలన కొనసాగుతుంది.

   . ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతూ మేము  మా పరిపాలనలో చాలా గౌరవించినామని చెప్పడం  పూర్తిగా అబద్ధం.  ప్రభుత్వ అనుకూల ఉపాధ్యాయ సంఘాలకు మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా వారికి  చోటు లేకుండా చేసి ఎమ్మెల్సీ  ఎన్నికైన వారి తో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర మనందరికీ తెలిసిందే. అంతే కాదు కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రి కాళ్లు మొక్కి  ప్రజల ఆత్మగౌరవాన్ని  తాకట్టు పెట్టిన విషయం తెలియదా?  ప్రభుత్వ హయాము లోపల  గత పిఆర్సి లోపల నెలల తరబడి  నోషనల్ గా  గుర్తించి రావలసిన బకాయిలను ఎగవేసి  ప్రస్తుతం మూడు డిఎ ల పెండింగ్ తో ప్రభుత్వం దిగిపోయిన విషయం ఎవరిది తెలియదు.  అలాంటి ఉపాధ్యాయ ఉద్యోగులను నిర్ణయం తీసుకోండి అంటే ఇప్పటికే  ఆ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి  పౌర ప్రజాస్వామిక హక్కుల తో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు  కొంత ఆలస్యంగా నైనా ప్రభుత్వం పై విశ్వాసం ఉన్న కారణంగా  ఉద్యోగులను నమ్మబలికితే  ఓట్లు వేస్తారు అనుకోవడం అత్యాశే.

 టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో వరి ధాన్యం కొనుగోలుకు  కేంద్రం పైన ప్రతిరోజు  యుద్ధం చేసి కొనుగోలు చేస్తలేదని  బధునాము చేసిన విషయం తెలుసు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో  ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏనాడైనా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శ వినబదినదా? రైతులు ప్రజలు కార్మికులు తెలుసుకోవాలి.  ఇక కరెంటు విషయంలో కో తలని  చెబుతున్నారు మీ హయాములో ఇచ్చినటువంటి కరెంటు, ఒప్పందాలు , నిర్మాణం ప్రారంభించిన టువంటి  భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్లకు సంబంధించి విచారణ కమిటీని నియమించడం జరిగింది. అప్పుడు గాని మీ నిజాన్నిజాలు బయటికి రావు . నాణ్యమైన కరెంటు ఇచ్చినమని చెప్పుకుంటే  కోట్లాది రూపాయల ఉద్దెర బేరంతో ప్రభుత్వాన్ని నడిపిన విషయం బయటకి రాక తప్పదు.
     ఇక ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొడతారని,  రైతు బంధు, రు  రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పంటి వాటితో పాటు నీటి పథకాన్ని సరిగా అమలు చేయడం లేదని  రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ప్రతిపక్ష పార్టీకి తగదు.  తిరిగి 5 సంవత్సరాల దాకా ఏ కోశానా అధికారానికి వచ్చే అవకాశం లేదు ప్రజలు తిరస్కరించినందున ప్రతిపక్షంలో కూర్చుని, చట్టసభలకు హాజరై, ప్రభుత్వానికి నమ్రతగా తమ సూచనలను ఇవ్వడం తప్ప గత్యంతరం లేదు. కానీ అహంభావము ఆధిపత్యంతో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే రాజ్యాంగపరమైనటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో  ఘర్షణ వైఖరి మానుకుంటే మంచిదని  సలహా ఇస్తున్నారు.  టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పోలీసులు ప్రభుత్వ భజన చేసిన విషయం అందరికీ తెలుసు  కలెక్టర్లు మంత్రులు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి నుండి మంత్రులకు శాసనసభ్యులకు కలిసే అవకాశం లేనటువంటి  నిరంకుశత్వం కొనసాగిన పరిపాలనకు భిన్నంగా  ప్రజాస్వామ్య పద్ధతి కొనసాగుతూ ఉంటే  టిఆర్ఎస్ అధినేత పోలీసులను బెదిరించి  మీ అరాచకాలు ఆపకుంటే మేము అధికారానికి వచ్చినంక చూసుకుంటాం అని బెదిరించడం అంటే  మీ అధికారంలో మీరు కూడా అరాచకాలు కొనసాగించినట్లే కదా

న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి

ప్రజలను రెచ్చగొట్టడం  సభలు సమావేశాలలో ప్రజలతో  హామీలపైన  నినాదాలు ఇప్పించడం,  అధినేతతో పాటు  వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రులు కూడా  చౌకబారు మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం,  ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలను అగౌరవపరిచి ప్రజలను  అవమానించడాన్ని ఉపేక్షించవలసిన అవసరం లేదు.  ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ తో పాటు న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకొని  ముందుగా టిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలి ఆ తర్వాత ఇదే క్రమంలో చౌకబారు రాజకీయాలు మాటలు అశ్లీల అసభ్య మాటలు ఎవరు మాట్లాడిన  రికార్డులు తెప్పించుకొని విచారణ జరిపించి దోషులుగా తేల్చి కటకటాల్లోకి నెట్టాలి.  అప్పుడు కానీ ఈ  అసంపూర్ణ రాజకీయ అజ్ఞానులకు బుద్ధి రాదు. " పాలకులను రాజకీయ పార్టీలను విమర్శించే సత్తా అధికారం సార్వభౌమాధికారము స్వేచ్ఛ ప్రజలకుంటుంది" కానీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీని విమర్శించడానికి ప్రజలకు ఉన్నంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవని గుర్తిస్తే మంచిది.  ఇక్కడ టిఆర్ఎస్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజలు బుద్ధి జీవుల మాదిరిగా  ప్రభుత్వాన్ని విమర్శించడం అవివేకం. ఆ అర్హత  ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా టిఆర్ఎస్కు లేదు .

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షకుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333