ఎరువుల దుకాణదారులు స్టాక్ రిజిస్టర్ లో నిలవలను తప్పకుండా నమోదు చేయాలి..... తాసిల్దార్ జి చంద్రశేఖర్
మునగాల 21 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- మునగాల గ్రామంలోని మన గ్రోమోర్ సెంటర్ ఎరువుల దుకాణాన్ని స్థానిక తహసీల్దార్ జి.చంద్రశేఖర్, మునగాల మండల వ్యవసాయ అధికారి బి.రాజు, మునగాల ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు, ఈ సందర్భంగా వారు మన గ్రోమోర్ సెంటర్లోని ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను, బిల్ బుక్ లను, ప్రస్తుతం ఉన్న యూరియా & ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతూ ఎంఆర్పి ధరల గురించి అడుగగా, యూరియా ను 266 రూపాయలకే ఇస్తున్నారు అని తెలియజేశారు. అనంతరం నానో యూరియా వాడకం, ఉపయోగాలు గురించి రైతులకు అవగాహన కల్పించారు.మునగాల మండలంలో 1120 బాటిల్ల నానో యూరియా అందుబాటులో ఉందని, ప్రస్తుతం కొక్కిరేణి, మునగాల, తాడ్వాయి సహకార సంఘాలలో యూరియా అందుబాటులో ఉంది అని, రైతులు తప్పనిసరిగా యూరియా బస్తాలతో పాటు నానో యూరియా బాటిల్ కూడా కొనుగోలు చేయాలని, పిచికారి చేయటం అలవాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మన గ్రోమోర్ సెంటర్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.