ఎన్సీడీ ఫాలోఅప్ కేసులు ప్రతినెల క్రమం తప్పకుండా చేయాలి:స్టేట్ సివి హెచ్వో డాక్టర్ అబ్దుల్ వాసే

Aug 21, 2024 - 19:44
 0  5
ఎన్సీడీ ఫాలోఅప్ కేసులు ప్రతినెల క్రమం తప్పకుండా చేయాలి:స్టేట్ సివి హెచ్వో డాక్టర్ అబ్దుల్ వాసే

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం డి .ఎం.హెచ్.ఓ డాక్టర్ సిద్ధప్ప ఆదేశాల మేరకు, మరియు ప్రోగ్రాం అధికారి జి రాజు  ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య అధికారి సి వి హెచ్ ఓ అబ్దుల్ వాసే విచ్చేసి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు, మరియు హెల్త్ సూపర్వైజర్లకు, ఎన్సిడి స్క్రీనింగ్ పై రివ్యూ తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నెల నెల గ్రామాలలో ఉన్నటువంటి బీపి షుగర్ పేషెంట్లకు, మందులు పంపిణీ చేసి,ఆన్లైన్ నందు ఎంట్రీ చేయాలని  తెలిపారు, అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్లు ఇట్టి కార్యక్రమం పై పర్యవేక్షణ చేయాలని  మరియు ఏఎన్ఎం స్క్రీనింగ్ గ్రామాల యందు  క్వాలిటీ గా  క్యాంపులను ఏర్పాటు చేసి, 30 సంవత్సరముల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ జరపాలని, మెడికల్ ఆఫీసర్ లాగిన్ కి పంపించి స్కానింగ్ జరపాలని ఈ సందర్భంగా తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ , డిడియం రామాంజనేయులు, కళ్యాణి, వివిధ ప్రాథమిక మెడికల్ ఆఫీసర్లు మరియు సూపర్వైజర్లు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333