ఎంఇఒకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్

Jul 19, 2026 - 09:51
 0  2
ఎంఇఒకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్

గుమ్మడిదొడ్డి పాఠశాలకు అదనపు ఉపాధ్యాయులను నియమించాలి

ఎంఇఒకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్

తెలంగాణ వార్త /వాజేడు:

ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మడి దొడ్డి ఎంపీయూపీఎస్ పాఠశాలకు అదనపు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గుమ్మడిదొడ్డి సర్పంచ్ బోదేబోయిన భరత్ కుమార్ ఆధ్వర్యంలో మండల విద్యా శాఖ అధికారి కి శనివారం వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అదనపు ఉపాధ్యాయులను నియ మించాలని వినతిపత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో జెజ్జరి సంతోష్, కారం ఆనంద్, పాయం పరమేష్, ఇర్ప భరత్, మొడెం రాంప్రసాద్, మొడెం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్