కార్యకర్తకు కన్నీళ్ళతో వీడ్కోలు పలికిన సంకినేని

May 16, 2024 - 19:58
 0  10
కార్యకర్తకు కన్నీళ్ళతో వీడ్కోలు పలికిన సంకినేని

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సూర్యాపేట జిల్లా కార్యకర్తకు కన్నీళ్ళతో వీడ్కోలు పలికిన సంకినేని* *కొప్పుల క్రాంతిరెడ్డి గారికి ఘన నివాళులు అర్పించిన సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి* భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పార్లమెంట్ కో కన్వీనర్ కొప్పుల క్రాంతిరెడ్డి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అంత్యక్రియలను వారి స్వగ్రామం ఆత్మకూరు(S) గ్రామంలో నిర్వహించడం జరిగింది... బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు, బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.... సూర్యాపేట నియోజకవర్గ నాయకులందరూ అంతిమయాత్రలో పాల్గొని ఇన్ని రోజులు పార్టీలో తమతో కలిసి పనిచేసిన కొప్పుల క్రాంతిరెడ్డి కి కన్నీటితో ఘనంగా వీడ్కోలు పలికారు*