ఇంటి పరిషరాలలో నీరు నిలువ ఉండకుండగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి

:డీఎంహెచ్ఓ శశికళ

May 16, 2024 - 22:31
 0  18
ఇంటి పరిషరాలలో నీరు నిలువ ఉండకుండగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఇంటి పరిషరాలలో నీరు నిలువ ఉండకుండగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జాతీయ డెంగ్యూ అవగాహన ర్యాలీ.

జోగులాంబ గద్వాల 16 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల:--ఇంటి పరిషరాలలో నీరు నిలువ ఉండకుండగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ శశికళ అన్నారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం" సందర్భంగా  డిఎంహెచ్ఓ డాక్టర్ శశికళ ర్యాలీ ని ప్రారంభించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పాత డిఎంహెచ్ఓ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.డెంగ్యూ వ్యాధి నినాదాలతో పాత బస్టాండ్ వరకు ర్యాలీని కొనసాగించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్వో  మాట్లాడుతూ...డెంగ్యూ వ్యాధి మన ఇంటిలో తిరిగే ఇడీస్ విజిప్టి.. అనే దోమ కాటు వలన అర్బో వైరస్ మన శరీరంలో ప్రవేశించడం వలన వస్తుందని, ఈ దోమ పగటిపూట ఎక్కువగా కుడుతుందని,ఈ దోమకు మళ్లీమళ్లీ కుట్టే స్వభావం ఉండడం వలన ఇంటిలోని ఒకరి కంటే ఎక్కువ మందికి డెంగ్యూ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు, ఇంటి పరిషరాలలో నీరు నిలువ ఉండకుండగా చూసుకొని మరియు మురికి గుంటలు లేకుండా చూసుకోవాలని,ఇంటి పరిసరాలలో ఉన్న తొట్లు పూల కుండీలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకొని ఎండబెట్టుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు  స్రవంతి,జి రాజు, సిహెచ్ఓ రామకృష్ణ, సబ్ యూనిట్ ఆఫీసర్ శివన్న, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్లు శ్యాంసుందర్ మక్సుద్, సీసీ వెంకటేష్, డివిఎల్ఎం నరేంద్రబాబు, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ అర్బన్ హెల్త్ సెంటర్ అబ్రహం హనుమంతు నర్సింలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎమ్ లు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333