ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం

తిరుమలగిరి 03 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పెద్ద కోల సంజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మోడల్ స్కూల్ నందు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసి గ్రూపులకు 40 అడ్మిషన్లు చొప్పున మొత్తం 160 సీట్లు ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు http://183.82.97.97/mstg అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదని ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు తేదీ 05/05/2025 నుండి 20/05/2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.