కులగణన ద్వారానే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది

తిరుమలగిరి 03 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం లో యువజన కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధక్షులు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అంబేద్కర్ మాట్లాడుతూ దేశావాప్తంగా కుల గణన మరియు జనగణన కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో ద్వారా దేశం మొత్తం పాదయాత్ర చేసి కుల గణన ద్వారా పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది అని పార్లమెంట్ లో పలు మార్లు ప్రస్తవించి కుల గణన దేశ వ్యాప్తంగా చేయాలనీ చేసిన పోరాట ఫలితంగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరుచుకుందని వెంటనే చేపట్టాలని కచ్చితమైన సమయ పరిమితి పెట్టి పూర్తి చేయాలనీ అదే విధంగా దానికోసం ప్రతి పక్షలని మరి సామజిక కుల సంఘాల్ని కలుపుకొని కమిటీ వేసి పూర్తి చేయాలనీ కేవలం ప్రకటనకే పరిమితం చేయొద్దని ఆలా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మండల అధ్యక్షులు ఎల్సొజు నరేష్,వర్కింగ్ ప్రెసిడెంట్ జూమిలాల్,ప్రెస్ ఇంచార్జి కందుకూరి లక్ష్మయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ యాదవ్,ex ఎంపీటీసీ అబ్బాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వేణు రావు,హఫీజ్,nsui మండల అధ్యక్షులు బోడ వెంకటేష్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జి లింగన్న,పత్తేపురం సుధాకర్,దొంతరబోయిన నర్సింహా,చింతకాయల సుధాకర్,పానగంటి గణేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు బోండ్ల వంశీ, ఎల్లంల యాకన్నా,సోమరాపు వెంకటేష్,రాకేష్ యాదవ్,ఉడుగు రోహిత్, కందుకూరి సంతోష్,గణేష్ ముదిరాజ్, బోనగిరి యశ్వంత్,కత్తుల రాకేష్,ముండ్ల మహేష్,పవన్ కుమార్,గోపాలదాస్ సోమేశ్,ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.