ఆర్డీఎస్ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయాలి

Aug 13, 2026 - 20:06
 0  1

ఎండిపోతున్న పంటలను కాపాడాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతి:కొమ్ముల ప్రవీణ్ రాజ్.

రైతుల పంటలను కాపాడేందుకు ఆర్‌డీఎస్ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలి: సింధనుర్ ఉప్పరి గంగాధర్,

ఆయకట్టు రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి.

జోగులాంబ గద్వాల 13 ఆగస్టు తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల., ఆగస్టు 13: ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ఆర్‌డీఎస్ కాలువ ద్వారా తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ.. ఆర్‌డీఎస్ ఆయకట్టు పరిధిలో వేలాది ఎకరాల పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.

సింధనూర్ ఉప్పరి గంగాధర్, మాట్లాడుతూ.. పంటలకు సకాలంలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, అధికారులు తక్షణమే స్పందించి ఆర్‌డీఎస్ కాలువకు సాగునీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి రాముడు, జిల్లా జనరల్ సెక్రెటరీ సిద్దయ్య, దినేష్, జుంజు కృష్ణ, కాశీరాం, భాస్కర్, అంజి, నవాజ్, వెంకటన్న, భీమేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333