ధరలు పెంచి ప్రజల సంపదను కొల్లగొడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం – సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు ధ్వజం

Aug 13, 2026 - 20:05
 0  1
ధరలు పెంచి ప్రజల సంపదను కొల్లగొడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం – సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు ధ్వజం

ధరూరు మండలంలో కొనసాగిన సిపిఐ ప్రచార కార్యక్రమం

జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజల సంపదను కొల్లగొడుతూ, ఆ సంపదను బడా కార్పొరేట్లకుఅలాగే మోడీ మిత్రులకు దోచిపెట్టి రోజుకొక అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోంన్నదని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు తీవ్రంగా ధ్వజమెత్తారు.

ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం నుంచి ప్రారంభమై చింతరేవుల, నర్సం దొడ్డి సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని విమర్శించారు.

ప్రజా సమస్యలపై పార్లమెంటులో సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని బి. ఆంజనేయులు ఆరోపించారు. ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టి పాలన కొనసాగించడం బీజేపీ ప్రభుత్వ విధానమని ఆయన మండిపడ్డారు.

ధరల పెరుగుదలను వెంటనే నియంత్రించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఏసు , ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పేరు కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు భరత్ , ఎఐటియుసి హమాలీ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బతుకన్న ,ఆంజనేయులు, సీనియర్ నాయకుడు రాజు, హమాలి ఆంజనేయులు , సిపిఐ ఏఐటియుసినాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333