డిసెంబర్ 7న అధికారంలోకి వస్తాను, డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా నెరవేర్చని రేవంత్ రెడ్డి

Dec 4, 2024 - 16:07
 0  18
డిసెంబర్ 7న అధికారంలోకి వస్తాను, డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా నెరవేర్చని రేవంత్ రెడ్డి

ఏడాది అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటు..

విజయోత్సవాల కోసం కోట్లు ఖర్చు చేయడం ప్రజలు  ఆశ్చర్యపోతున్నారు.. జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి..

????వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తా అని చెప్పిఅధికారంలోకి వచ్చి  ప్రజలకు వెన్నుపోటు పొడిచారు....

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రం లోని  కాంగ్రెస్ పార్టీ  6 గ్యారెంటిలు ,66 మోసాలు పేరుతో గద్దెనెక్కి ఏ ఒక్క గ్యారెంటీ పూర్తి గా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను  మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గడుతూ ఈ రోజు గద్వాల  పట్టణం లోని డికె. బంగ్లా నుండి వైఎస్సార్ చౌక్ ,అంబేద్కర్ చౌక్ ,రాజీవ్ మార్గ్ కూడలిలో  పెద్ద ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది
అనంతరం వైయస్సార్ చౌక్ దగ్గర ఏర్పాటు చేసిన  సమావేశం కు  ముఖ్య అతిథిగా  బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి హాజరై మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు  కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని అందులో భాగంగా  మహాలక్మి,గృహ జ్యోతి ,గ్యాస్ సబ్సిడీ పేరుతో మహిళల ను,రైతు బంధు,వడ్లకు బోనస్ ,కౌలు రైతులకు రైతు బంధు అంటూ  తెలంగాణ రైతులను నట్టేటముంచేశాడు, 4,000 పింఛను అంటూ వృద్దులకు,6000 వేల పింఛన్ అంటూ వికలాంగులకు మోసం చేశాడు.. హామీలు అమలు చేయకపోగా తెలంగాణ రాష్ట్రం ను అప్పులపాలు చేసిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రనికి ముఖ్యమంత్రి గా అనర్హుడు అంటూ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు..
గద్వాల  నియోజకవర్గం కు గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నిర్లక్ష్యం చేసింది అవి కూడా పూర్తి చేయాలని ఆలోచన చేయట్లేదు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..
మీరు ఇచ్చిన జోగులంబా గద్వాల  జిల్లాకు ఇచ్చి అమలు చేయని హామీలు
➖అలంపూర్ నియోజకవర్గం లో Rds చివరి ఆయకట్టు కు నీరు ఇస్తాము అని హామీ
బోయలను ST జాబితాలో చేర్చుట
గుర్రం గడ్డ బ్రిడ్జి పెండింగ్
జూరాల దగ్గర బృందావన్ గార్డెన్ నత్త నడకన పనులు
గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు వాయిదాలకే పరిమితం
Kt దొడ్డి లో ST  స్కూల్
నెట్టెంపాడు పెండింగ్ పనులు
నియోజకవర్గంకు సంబంధించిన R&B రోడ్లు అస్థవ్యస్థం
ద్వాల మున్సీపాలిటీ కి 100 కోట్ల నిధులు

ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, అసెంబ్లీ మాజీ కన్వీనర్ రామాంజనేయులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీర్జాపూర్ రామచంద్ర రెడ్డి పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు క్రిష్ణ వేణి,కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లెం దొడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఐటీ సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్,మండల అధ్యక్షులు పాల్వాయి రాముడు, హానిమి రెడ్డి, రాజేష్ అయ్యా,రాష్ట్ర బిజెవైఎం కార్యవర్గ సభ్యుడు ఢిల్లీ వాలా క్రిష్ణ, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనిల్,బిజెపి సీనియర్ నాయకులు దరూర్ కిష్టాన్న, మధుసూదన్ అయ్యా,నల్లా రెడ్డి తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333