ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు

Aug 9, 2024 - 19:45
Aug 9, 2024 - 22:54
 0  74
ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు
ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు

*దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలిసులు

 30 లక్షల విలువగల 35.4 తులాల బంగారు 10 తులాల సిల్వర్ ఆభరణాలను, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాదినం.

6 గురు దొంగల అరెస్ట్. చివ్వెంల PS కేసులో ఒక దొంగ పరారీ.

మునగాల, హుజూర్నగర్, చివ్వెంల PS ల పరిధిలో దొంగలను అరెస్ట్ చేయడం జరిగినది.

సన్ ప్రీత్ సింగ్, ఎస్పీ సూర్యాపేట జిల్లా 

సూర్యాపేట  09 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఒంటరిగా నిద్రిస్తున్న మహిళా ఒంటిపై నుండి అబరణాలు దొంగిలిస్తున్న దొంగను, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ, పురుషుల జంటలను బెదిరించి దొంగతనాలకు, రాబరీలకు పాల్పడుతున్న దొంగలను, తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనాలు చేస్తున్న దొంగ ను అరెస్ట్ చేయడం జరిగినది. కేసులకు సంభందించి జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ జిల్లా పొలిసు కార్యాలయం నందు విలేకరుల సమవేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మునగాల, హుజూర్నగర్, చివ్వేoల పొలిసులు అరెస్ట్ చేసి వారి నుండి 30 లక్షల విలువగల 35.4 తులాల బంగారు 10 తులాల సిల్వర్ ఆభరణాలను, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు  స్వాదినం చేసుకుని 6 గురు నిందితులను రిమాండ్ కు పమపడం జరిగినది, చివ్వెంల PS కేసులో ఒకరు పరారీలో ఉన్నారు స్త్రీ పురుషులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న విషయమై బాదిడితును పిర్యాధు చేయాలి అని ఎస్పీ కోరారు.

హుజూర్నగర్ పి‌ఎస్ :

 హుజూర్నగర్ SI తన సిబ్బందితో కలిసి 9-8-2024 రోజున ఉదయం 07-00 గంటల సమయంలో గోవిందపురం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరస్తుడు అనుమాస్పదంగా తన యెక్క మోటార్ సైకల్ పై హుజూర్ నగర్ వైపు వస్తు, పోలీస్ వారిని చూసి తన వాహనాన్ని వెనుకకు తిప్పుచుండగా మేళ్లచెరువు మండలానికి చెందిన కొట్టే సురేశ్ పట్టుబడి చేసి విచారించగా జులై 30 వ తారీఖు న హుజూర్ నగర్ పట్టణంలోని NGOs కాలనికి వెళ్ళి అక్కడ చింతలచెరువు వీరస్వామి ఇంటి తాళం పగలగొట్టి బీరువా నందు గల 3 తులాల నల్లపూసల గొలుసు, 2 గ్రాముల మాటిలు తన నేరాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నింధితుడు మేళ్లచెరువు మండలం, రామాపురం గ్రామానికి చెందిన కొట్టే సురేశ్ కోదాడ పట్టణంలోని గేట్ కాలేజీ నందు B.Tech మొదటి సం.రం చదువుచూ ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు, దొంగతనాలకు పాల్పడుతూ తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలు చేస్తూ బెట్టింగ్ లు పెడుచున్నాడు. నింధితుడు సురేశ్ చింతలపాలెం పియస్ పరిధిలోని దొండపాడు గ్రామంలో ఒక ఇంట్లో, మేళ్లచెరువు మండలం వేపల మాధారం గ్రామంలోని రెండు ఇండ్లల్లో, కోదాడ పట్టణం నయనగర్ లో దొంగతనలు చేసినాడు. ఇతనిపై కోదాడ, హుజూర్నగర్, చింతలపాలెం, మేళ్లచెరువు పి‌ఎస్ ల పరిధిలో 5 కేసుల్లో నేరాలకు పాల్పడినాడు. ఇతని నుండి 13.4 తులాల బంగారం, మొబైల్, బైక్ సీజ్ చేయడం జరిగినది.

మునగాల ps :

 మునగాల PS పరిధి 1-08-2024 రోజున ఆకుపాముల గ్రామశివారులో రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి 7 తులాల బంగారం చోరీ చేసినారు ఈకేసు మునగాల PS నంధు విచారణలో ఉన్నది. 7వ తేదీ సా.4 గంటల సమయంలో మునగాల పొలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది తాడ్వాయి స్టేజ్ వద్ద వాహనములు తనిఖీ చేయుచుండగా ఖమ్మం కు చెందిన (A1) పాకలపాటి ధర్మ తేజ వ: 33 సం.లు, (A2) సోమ రావిల్స్, వయస్సు: 25 సంవత్సరములు ఇద్దరు కలిసి దొంగతనం చేయబడిన బంగారు వస్తువులను తీసుకుని అమ్ముటకు బైక్ పై జగ్గయ్యపేట కు వెళుతుండగా పట్టుకొని విచారించగా దొంగతనాలు చేయబడిన సొత్తుగా ఒప్పుకున్నారు. వీరిని మునగాల PS కేసులో అరెస్ట్ చేసి విచారణ చేయగా నిర్మానుశ్యంగా ఉన్న ప్రాంతాలలో ఉన్న స్త్రీ, పురుషులను బేదిరించి డబ్బులు, ఆభరణాలు దొంగిలిస్తే, రాబరీ చేస్తే ఎవ్వరూ ఫిర్యాదు చేయరు అనే ఉద్దేశ్యంతో అలాంటి వారిని బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు అని గుర్తించడం జరిగినది. ఏ1 పాకలపాటి ధర్మ తేజ పై 2015 నుండి ఖమ్మం లోని రఘునాధపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో నిర్మానుస్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న స్త్రీ పురుషులను బెదిరింపు, రాబరీ, డెకాయిటీ చేసి నేరాలకు పాల్పడి ఫిబ్రవరి-2023 లో ఖమ్మం రూరల్ పోలీసు వారు రిమాండ్ చేశారు, బెయిల్ పై వచ్చి (A2) సోమ రావిల్స్ తో కలిసి నవంభర్ -2023 కోదాడ లో బంగారు గొలుసు లాక్కొని పోయిన కేసులో కోదాడ టౌన్ పోలీసు వారు రిమాండ్ చేయగా బెయిల్ మీద బయటకు వచ్చి మునగాల PS పరిధి 1-08-2024 రోజున ఆకుపాముల గ్రామశివారులో రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి 7 తులాల బంగారం చోరీ చేసినారు. జనవరి నెలలో చౌటుప్పల్ PS పరిధి, ఫిబ్రవరి నెలలో కేతేపల్లి PS పరిధిలో, మే నెలలో కోదాడ టౌన్ పి‌ఎస్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినారు. (A1) పాకలపాటి ధర్మ తేజ ఖమ్మo, సూర్యాపేట జిల్లాలో, చౌటుప్పల్ PS పరిధిలో మొత్తం 12 కేసుల్లో నేరాలకు పాపడిన నేర చరిత్ర ఉన్నది. 16 తులాల భంగారం, 2 మొబైల్స్, బైక్ సీజ్ చేయడం జరిగినది.

చివ్వెంల పి‌ఎస్ కేసు:

 21.02.2024 న PS చివ్వెంల నందు పిర్యాధు దారు కల్లు మల్లారెడ్డి, వయస్సు. 53 సంవత్సరాలు, occ. అగ్రి, R/o తిమ్మాపురం గ్రామం, చివ్వెంల మండలం, 20.02.2024 రాత్రి 01.00 గంటల సమయంలో అతని తల్లి రాములమ్మ వయస్సు. 85 ఏళ్లు వాకిలి (వరండా)లో నిద్రిస్తుండగా, కొందరు గుర్తుతెలియని నేరస్తులు అతని ఇంట్లోకి ప్రవేశించి తల్లి నోరు మూసి బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. ఆమె మెడలోంచి దాదాపు 4 తులాలు ఎత్తుకెళ్లి పారిపోయారు. కేసు విచారణ చేస్తుండగా ఈరోజు 09.08.2024 మధ్యాహ్నం సూర్యాపేట రూరల్ పోలీస్ సర్కిల్-ఇన్‌స్పెక్టర్ & అతని సిబ్బంది తో కలిసి దురాజ్‌పల్లి ఎక్స్‌రోడ్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా నిందితులు బైక్ పై అనుమాన్స్పదంగా కోదాడ వేపు నుండి సూర్యాపేట వైపు వెళుతుండగా పట్టుకున్నారు. ముగ్గురు నింధితులను గుర్తించగా మునగాలకు చెందిన A1 Anthani Yalamanda, A2 Valloju Sathish, A3 Dakuri Upender, మరో నింధితుడు అయితేగొని గోపి(పరారీ) లు గా గుర్తించడం జరిగినది. A1, A2, A3 ముగ్గురు నింధితులు 9 కేసుల్లో నేరాలకు పాల్పడట్లు గుర్తించడం జరిగినది.

 A3 Dakuri Upender పెంపహాడ్, గరిడేపల్లి PS ల పరిధిలో 2 కేసుల్లో, A2 Valloju Sathish మునగలలో PS పరిధి హత్యకేసులో, సూర్యాపేట టౌన్ పరిధిలో మొత్తం 4 కేసుల్లో నేరాలకు పాల్పడ్డాడు ఏ4 గోపి పరారీలో ఉన్నాడు. ఏ1, ఏ2, ఏ3 లను రిమాండ్ కు పామడం జరిగినది. వీరినుండి 6 తులాల బంగారం, 10 తులాల సిల్వర్, బైక్, మూడు మొబైల్స్ స్వాదినం చేసుకోవడం జరిగినది. ఈ కేసు గుర్తించడంలో జిల్లా సి‌సి‌ఎస్ పోలీసు సిబ్బంది బాగా పని చేశారు.

ఈ సమావేశం నంధు అధనపు ఎస్పీ నాగేశ్వరావు, కోదాడ DSP శ్రీధర్ రెడ్డి, మునగాల సర్కిల్ CI రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట రూరల్ CI సురేంధర్ రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ ఆనంద్ కిషోర్, SI లు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ముత్తయ్య, సాయి ప్రశాంత్, రత్నం, సిబ్బంది ఉన్నారు. కేసుల్లో బాగా పని చేసిన CI రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట రూరల్ CI సురేంధర్ రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ ఆనంద్ కిషోర్, SI లు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ముత్తయ్య, సాయి ప్రశాంత్, రత్నం లను సిబ్బందిని ఎస్పీ అభినందించి.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223