బోనాల పండుగకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు

Aug 9, 2024 - 07:24
 0  69
బోనాల పండుగకు  కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు

*బోనాల పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు*.. 

బోనాల పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కొరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఊర ముత్యాలమ్మ అమ్మవారి గుడిని డిఎస్పి రవి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తామని సూచించారు. షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజశేఖర్,ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం, ఏఎస్ఐ శంకర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223