ఆత్మకూరు (ఎస్) మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతంగాన్ని ఆదుకోవాలి.

Mar 12, 2024 - 15:39
 0  41
ఆత్మకూరు (ఎస్) మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతంగాన్ని ఆదుకోవాలి.

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్     ఆత్మకూరు యస్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతంగాన్ని ఆదుకోవాలి.ఆత్మకూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆత్మకూరు(ఎస్ )తాహాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి *సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి కునుకుంట్ల సైదులు* పాల్గొని మాట్లాడుతూ రైతులు ఆరుగాళ్లం కష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే ముందు రైతే రాజు అన్న ప్రభుత్వాలు రైతులను విస్మరించారు. ఆత్మకూరు(ఎస్ )మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతంగానే ఆదుకోవాలని, నీరు లేక ఎండిపోయిన పొలాలకు ఎకరానికి నష్టపరిహారం 30000 రూపాయలు చెల్లించాలని, ఎస్సారెస్పీ నీటిని చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేటట్టు, చెరువులు, కుంటలు నింపాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతు పండించినటువంటి పంటకు కింటాకు 500 బోనస్ ఇవ్వాలని రైతుబంధు రైతులకు ఇవ్వాలని, రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని, మార్కెట్లో రైతాంగాన్ని మోసం చేస్తున్న దళారులను అరికట్టాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. *ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పోరండ్ల దశరథ, మండల నాయకులు డేగల వెంకటకృష్ణ,కొండేటి సంజీవరెడ్డి, అరుణోదయ జిల్లా నాయకులు బోల్లే వెంకన్న, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సామా నర్సిరెడ్డి, పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సక్క, సీతారాం రెడ్డి, మాచి రెడ్డి, వీరారెడ్డి, సుదగాని వెంకన్న,బోయిని నాగయ్య, తాళ్లపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు*