అడ్డుపడిన వారినే వెంట తీసుకెళ్లే రాజకీయ చాతుర్యం... తెలంగాణ కోసం ఆగని పోరాటం
ఇన్నాళ్లు హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విషయంలో అడ్డంకులు సృష్టించారని విమర్శలు ఎదుర్కొన్న కిషన్ రెడ్డిని సైతం వెంట తీసుకెళ్లి, ఢిల్లీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై చర్చ జరిగేలా చేయడం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చాతుర్యానికి నిదర్శనం.
ఒక్కోసారి ఫైళ్లు కదలవు...
ఒక్కోసారి రాజకీయ అడ్డంకులు వస్తాయి...
కానీ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆగడు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మాత్రమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ప్రాజెక్టు, ప్రతి రూపాయి కోసం నిరంతరం ఢిల్లీ తలుపులు తడుతున్నాడు.
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే నాయకత్వం ఉంటే ఫలితాలు వస్తాయి.
అందుకే తేడా పదవిలో కాదు...
పని చేసే తత్వంలో ఉంది.