80 ఫీట్లు రోడ్డు ఉన్నచోటే ఆర్ఓబి

Sep 25, 2026 - 19:48
 0  1

సెకండ్ రైల్వే గేట్ వద్ద కాకుండా, కిలోమీటర్ 186/6-7 వద్ద గల 80  అడుగుల రోడ్డులోనే  నిర్మాణం..

స్థానికులు ఎవరు ఆందోళన చెందవద్దు..

డికె.స్నిగ్ద రెడ్డి ..

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల పట్టణంలోని డికె.బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో జిల్లా యువ నాయకురాలు  డికె. స్నిగ్ద రెడ్డి  మాట్లాడుతూ. 

రెండవ రైల్వే గేటు దగ్గర ఆర్ఓబి నిర్మిస్తామని వచ్చిన వాటిని నమ్మవద్దని 80 ఫీట్ల రోడ్డు ఉన్నచోటే ఆర్ఓబి నిర్మించడం జరుగుతుందని బిజెపి పార్టీ యువ నాయకురాలు డికె. స్నిగ్ధ   రెడ్డి తెలిపారు.. 

మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు రైల్వే శాఖ ఇచ్చిన జీవో ప్రకారం 80 ఫీట్ల రోడ్డు ఉన్నచోట ఆర్ఓబి నిర్మితం అవుతుందని రెండవ రైల్వే గేట్ ప్రాంతంలో ఉన్నవారు ఎలాంటి ఆందోళననకు గురి కావద్దని తెలిపారు.

సెకండ్ రైల్వే గేట్ వద్ద కాకుండా, కిలోమీటర్ 186/6-7 వద్ద గల 80 ఫీట్లు రోడ్డులోనే కొత్త ఆర్‌ఓబీ నిర్మిస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసిందని తెలిపారు. పాత రికార్డుల వల్ల చిన్న కన్ఫ్యూజన్ తలెత్తిందని, క్షేత్రస్థాయి సర్వే ప్రకారం ఇదే సరైన ప్రదేశమని పేర్కొన్నారు.

ఇందులో ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసిన చెల్లవని తుది నిర్ణయం రైల్వే శాఖ ఇచ్చిన 80 ఫీట్ల రోడ్డు వద్ద ఆర్ఓబి నిర్మిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, గద్వాల పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ ,జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి,ఓబీసీ మోర్చా,దేవా దాస్  కౌన్సిలర్ చంద్రశేఖర్ మహిళా మోర్చా సంధ్యా, భారతి సీనియర్ నాయకులు మీర్జాపురం వెంకటేస్వర రెడ్డి, మధు గౌడ్, నరసింహశెట్టి,తదితరులు హాజరయ్యారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333