100 పడకల ఆసుపత్రిని వినియోగంలోకి తేవాలి. అవసరమైన వైద్య సిబ్బంది పరికరాలను ఏర్పాటు చేయాలి
సిపిఎం జిల్లాకార్యదర్శి వెంకటస్వామి డిమాండ్
జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఆలంపూర్ .చౌరస్తా లో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని వినియోగంలోకి తేవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ( సిపిఐఎం ) జిల్లా కార్యదర్శి ఏ .వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం అల్లంపూర్ చౌరస్తాలో ప్రభుత్వం నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఆయన పరిశీలించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ కావాలని నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసం ఆసుపత్రిని వినియోగంలోకి తేవడం లేదని , ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ ప్రారంభించిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని దీంతో నియోజకవర్గ ప్రజానీకం వైద్యం కోసం పక్క రాష్ట్రంపై ఆధారపడి వేల రూపాయలు నష్టపోతున్నారని కోట్ల రూపాయల ప్రజాధనం తో నిర్మించిన ఆసుపత్రి శిథిలా వ్యవస్థకు చేరుకున్నదని ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నదని ఆస్పత్రిలో అన్ని వసతులు కల్పించి వినియోగం లమలోకి తేవాలని, ఆసుపత్రి కి కాపలాగా ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సిబ్బందికి గత ఎనిమిది నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని , ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పోరాటం చేస్తామని హెచ్చరించారు ధర్నా నిర్వహించిన వారిలొ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జీకే ఈదన్న, పరంజ్యోతి , మండల నాయకుడు ఎం వెంకటేశ్వర్లు ధర్నాలో పాల్గొన్నారు శేషన్న అనిల్ దేవన్న మహేష్ శివప్రసాద్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎం వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులుఉండవెల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
9494 556309