హోటల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Jul 26, 2026 - 21:54
 0  1
హోటల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

  తిరుమలగిరి 27 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది.అధ్యక్షులుగా ఉయ్యాల వీరేశం, ఉపాధ్యక్షులుగా చిన్నగాని శ్రీహరి, కోశాధికారిగా ధరావత్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా మన్నూరు సోమన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తామని, మండలంలోని హోటల్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.మమ్ముల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న హోటల్ యాజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చింతకింది మురళి, సలహాదారులు కాసారపు సంజీవరెడ్డి, సిరివేరు రవికుమార్, శోభన్ కుదురుపాక రాములు, వాడపల్లి వెంకన్న, స్వామి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి