హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మెటీరియల్ పంపిణి కార్యక్రమం

జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఈరోజు మల్దకల్ మండలం బిజ్వారం ఉన్నత పాఠశాలలో జి హెచ్ ఎం జి మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ వ్యవస్థాపకులు రత్నసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలో చదువుకునే పదో తరగతి విద్యార్థులకు మా ట్రస్ట్ తరఫున ఉచితంగా మెటీరియల్ ను తయారు చేసి అందజేయడం జరుగుతుంది. ఇకముందు కూడా పేద విద్యార్థులకు మాస్ ట్రస్ట్ తరఫున ఇదే విధమైన సహాయ సహకారం అందిస్తామని తెలియజేశారు. అధ్యక్షత వహించిన మహేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థల కోసం నాణ్యమైన మెటీరియల్ ను ఎంతో ఖర్చుతో తాయారు చేసి ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి విద్యార్థికి అందజేయడం చాల అభినందించాల్సిన విషయం అని తెలిపారు ఈ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు సీమల రత్నసింహా రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, వెంకటేష్, కమ్మరి విష్ణు గోవిందు రాగిమాన్ తిమ్మారెడ్డి, GHM జి మహేష్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.