హలో బహుజన- చలో బడంగ్పేట్ బహుజన రాజ్యాధికారం యుద్ధ బేరి సభను విజయవంతం చేద్దాం

Mar 11, 2026 - 15:23
 0  2

గోడ పత్రిక ను విడుదల చేసిన.

బిఎస్పీ జిల్లా అధ్యక్షులు మాణికుమార్.
బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఎస్.రాజ్.

 జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల్ జిల్లా కేంద్రం) బిఎస్పీ జిల్లా అధ్యక్షులు మాణికుమార్ మరియు ఉపాధ్యక్షులు బండారి ఎస్ రాజు మాట్లాడుతూ........
బిఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్సీరాం 92వ జయంతి సందర్భంగా, బిఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ నాయకత్వంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు,తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించందని, మాన్యవర్ కాన్సీరాం చూపించిన మార్గంలో తెలంగాణ రాష్ట్రములో బహుజన ఉద్యమం చేసే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశానికి గుండెకాయ అయినటువంటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములో బాబాసాహెబ్ డా. అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాఫూలేల మార్గంలో బిఎస్పీ పార్టీని స్థాపించి, 4 సార్లు బిఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చిన ఘనత మాన్యవర్ కాన్సీరాం దని కొనియాడారు. భారతదేశ బహుజనుల రాజకీయాల దశ, దిశ మార్చిన గొప్ప నాయకుడు మాన్యవర్ కాన్సీరాం అని పేర్కొన్నారు. దేశంలోని ఆధిపత్య పార్టీలు డబ్బునోళ్ళను, కులం ఉనోళ్ళను పార్లమెంట్, అసెంబ్లీలకు పంపితే - సమాజంలో మెజారిటీ ఓట్లు ఉన్న బహుజనులను పార్లమెంట్, అసెంబ్లీలకు పంపిన ఘనత మాన్యవర్ కాన్సీరాం దని స్పష్టం చేశారు. ఇంతటి మహనీయుని 92వ జయంతి కార్యక్రమానికి జిల్లాలోని బహుజనులు అంత పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో అకేపోగు ఇమ్మానుయేల్ , వాల్మీకి , నగేష్  మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333