హత్య కేసులో నిర్దోషులుగా తీర్పు వెలువడడంతో

Sep 5, 2024 - 01:47
Sep 5, 2024 - 01:49
 0  42
హత్య కేసులో నిర్దోషులుగా తీర్పు వెలువడడంతో

న్యాయవాదికి సన్మానం

,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో సోమ గాని ఉదయ్, చెరుకు రణదీర్, కైసర్, సాజిద్,లపై అభియోగ మోపబడిన కేసులో ప్రముఖ న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ కేసును వాదించడం తో సూర్యాపేట జిల్లా కోర్టు వద్ద నిర్దోషులు, వారి బంధువులు న్యాయ వాది పొదిల ప్రదీప్ కుమార్ ని బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రజలకు న్యాయం చేయడంలో ముందుంటారని, ఏ సమయంలోనైనా స్పందిస్తారని అన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. న్యాయవాది ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదలకు కేసుల విషయానికి సంబంధించి సహాయం చేయడంలో ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంచర్ల సతీష్ కుమార్, మానన్ హనుమాన్ సింగ్, బి సుజాత, రాజు, కొంపెల్లి హరీష్, నిర్దోషుల మిత్రులు, కుటుంబ సభ్యులు, చిలుక మర్రి శ్రీనివాసచారి, ఇంద్రాల గురుస్వామి, గోపగాని వెంకన్న, బాసాని రామదాస్, పాలకూరి సైదులు, కుంభం నాగయ్య, సిరికొండ నాగయ్య, కంచర్ల రామారావు, దాసరి శ్రీనివాస్, వర్దెల్లి క్రాంతి, నజీర్ బాయ్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333