స్వేచ్ఛ , సమానత్వం , సమగ్రాభివృద్దే లక్ష్యంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం పనిచేస్తుంది  

Jun 21, 2026 - 19:26
 0  2
స్వేచ్ఛ , సమానత్వం , సమగ్రాభివృద్దే లక్ష్యంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం పనిచేస్తుంది  
స్వేచ్ఛ , సమానత్వం , సమగ్రాభివృద్దే లక్ష్యంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం పనిచేస్తుంది  

ఖమ్మం : తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్యయకర్తల సన్నాహక సమావేశం ఆదివారం బంజారా భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్యయకర్తలు ధారావత్ ప్రేమ్ చండ్ నాయక్ , డూడల సాంబయ్య లు హాజరై మాట్లాడారు . తెలంగాణలో ఉన్న సంపద , సహజ వనరులు , విధ్య , ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా అన్ని రంగాలలో ప్రతి ఒక్కరికి సమాన హక్యులు కల్పించడానికి మరియు సామాజిక తెలంగాణ స్థాపన , పౌర హక్యుల పరిరక్షణే లక్ష్యంగా (టిఎస్ డిఎఫ్) ఉంటుందని , రాజకీయ వేదిక ఏర్పాటు అవసరమైతే అన్ని వర్గాల మేధావులు , సామాజిక ఉద్యమకారులు , విద్యావంతులు , మహిళలు , యువకులు , వివిధ సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వేచ్ఛ , సమానత్వం , సమగ్రాభివృద్దే లక్ష్యంగా ప్రజాస్వామ్య పద్థతిలో అసమానతలు లేని రాజ్యాధికారం తేవడానికి తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం పనిచేస్తుందని అన్నారు . మన తెలంగాణ - మన భాధ్వత అనే భావనతో సామాజిక పరివర్తకులైన అన్ని వర్గాల ముఖ్య నాయకులు జూలై  5న జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు . ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నలుమూలల నుండి వచ్చిన సామాజిక ఉద్యమకారులు , మేధావులు ,  మహిళా ప్రతినిధులు , యువజన నాయకులు మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు . ఈ కార్యక్రమంలో బానోత్ బస్కి నాయక్ , బానోత్ బద్రు నాయక్ , నెహ్రూ నాయక్ , సంగమేశ్వరరావు , షేక్ నజీమా , విజయ కుమారి , రాంబాబు నాయక్ , శోభన్ నాయక్ , దాసరి శ్రీనివాస్ , అబ్దుల్ రెహమాన్ , రవీందర్ నాయక్ , వెంకటేశ్వర్లు , భూక్య సాయికుమార్ , వీరేందర్ , తోటపల్లి శ్రీను , భూక్య బద్రునాయక్ , శ్రీనివాస్ నాయక్ , వీరన్న నాయక్ , రాము నాయక్ , పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333