స్వీయ రక్షణతో పాటు కుటుంబం క్షేమం కోసం ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమాలు పాటించాలి.
----------- జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐపీఎస్.
జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
జాతీయ రోడ్ భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లా RTA శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణ వేణి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహాన ర్యాలికీ జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ గారు జెండా ఊపి ప్రారంభించారు.
కృష్ణ వేణి చౌక్ లో ప్రారంభమైన ర్యాలీ న్యూ బస్ స్టాండ్, సుంకులమ్మ మెట్టు, ఓల్డ్ బస్ స్టాండ్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని,ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం వుందని, విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులకు, బందువులకు తెలియజేయాలని , హెల్మెట్ లేకుండా బైక్ పై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. పరిమితికి మించి ఎక్కవ సంఖ్యలో ఆటోలలో వెళ్లరాదని, అతివేగం, అజాగ్రత్త తో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు.
ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి యువత వాహనాలను నడపడం ఒక హీరోయిజంగా భవించవద్దని, అలసత్వం వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని, వాహనదారుడు క్రమశిక్షణతో వాహనలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంగించిన వారికి పడే జరిమానాలు వాహన దారులు సురక్షితంగా ప్రయాణించేందుకే అనే విషయాలను వాహన దారులు గ్రహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన ద్వీచక్రవాహనదారులు మరణించడం జరుగుతోంది. కావున, ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని, విద్యార్ధులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఇట్టి విషయాలను స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలని కోరారు.
జాతీయ రోడ్ భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల అంత జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమలపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
అవగాహాన ర్యాలీ లో భాగంగా హెల్మెట్ ధరించాలని పబ్లిక్ వాహనాలకు రోడ్డు సేఫ్టీ స్టిక్కర్స్ ను జిల్లా ఎస్పీ గారు స్వయంగా అంటించారు.
ఈ ర్యాలీలో డి.ఎస్పీ శ్రీ వై.మోగిలయ్య, గద్వాల్ సిఐ టి.శ్రీను, RTO కృష్ణ రెడ్డి, MVI రాములు, AO రమేష్ కుమార్, గద్వాల్ టౌన్, రూరల్ ఎస్సై లు కళ్యాణ్ కుమార్, శ్రీకాంత్, ట్రాపిక్ ఎస్సై బాల చందర్, ట్రాపిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు..