స్వర్గీయ ఎన్టీ ఆర్  గారికికేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించాలి

Mar 29, 2026 - 18:38
 0  3
స్వర్గీయ ఎన్టీ ఆర్  గారికికేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించాలి

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు చొరవ తీసుకోవాలి.

కేంద్ర, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల విజ్ఞప్తి .

మార్చి 29 టెంపుల్ టౌన్ భద్రాచలం తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవా లసందర్భంగా, పార్టీ వ్యవస్థాపకులు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిధి, ఆర్దిక స్తోమత లేని అనేక వర్గాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోరాజకీయ అవకాశాలు, కల్పించి, పార్టీ పదవులలో, చట్టసభలలో, స్థానిక సంస్థలలో,కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాలలో అవకాశం కల్పించిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్లు సమర్పిస్తూ, ఆ మహనీయునికి భారత అత్యున్నత గౌరవ పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు రామావఝల. రవికుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి వేశారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న మే నెల 28 (తెలుగు ప్రజల పండుగ) తేదీనాటికి కేంద్రం, స్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రకటించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ.. శ్రీ చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చి సత్కరించాలని ఏపీ ప్రభుత్వం తీర్మానించాలని, ఎన్టీఆర్ అభిమానులు, కోట్లాదిమంది తెలుగు ప్రజలుకోరుతున్నారని  ఎన్టీఆర్ అభి మానసంగం అధ్యక్షులు  రామావఝల. రవికుమార్ తెలియజేశారు.పేద ప్రజల పెన్నిధి స్వర్గీయ ఎన్టీఆర్ అమర్ రహే

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333