స్థానిక అధికారుల ఆదేశాల మేరకే అనుమతులు ఉంటాయి..

Aug 21, 2026 - 14:12
Aug 21, 2026 - 14:23
 0  9
స్థానిక అధికారుల ఆదేశాల మేరకే అనుమతులు ఉంటాయి..

మట్టి. ఇసుక. కంకర తాసిల్దార్ నో అబ్జెక్షన్ ధ్రువీకరణ ఇవ్వడంతో అనుమతులు. 

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా మైనింగ్ ఇంచార్జ్ ఆనందం. మండల స్థాయి లో తాసిల్దారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. జారీ చేయడం వలన మట్టి కంకర ఇసుక అనుమతులకు జిల్లా అధికారులు అనుమతులు జారీ చేస్తారని గద్వాల జిల్లా మైనింగ్ ఇన్చార్జి ఆనందం తెలిపారు. వారు మాట్లాడుతూ. జిల్లాకు ఎక్కడ అనుమతులు కావాలన్నా స్థానిక అధికారులతో వచ్చే దానినిబట్టి జిల్లా అధికారులు పరిశీల నిమిత్తం ఉత్తర్వులు జారీ చేస్తారని జిల్లా ఏడి ఇంచార్జి మైనింగ్ అధికారి ఆనందం తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు గ్యాలరీలకు మెట్రిక్ టన్నుకు ప్రభుత్వానికి 55 రూపాయలు చెల్లిస్తే 60 రోజుల వరకు సంబంధిత మైనింగ్ను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని వారు అన్నారు. 44వ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో పనుల్లో భాగంగా పుటాన్ దొడ్డి నుంచి మట్టి తీసుకునేందుకు తాసిల్దారు ఇచ్చిన నో అబ్జెక్షన్ ఆధారంగా అవసరాన్ని బట్టి ప్రభుత్వ అభివృద్ధి పన్నుల్లో భాగంగా అనుమతులు వచ్చిందని వారు తెలిపారు. అక్కడ జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. పోలీసు రెవెన్యూ మైనింగ్ అధికారుల సమన్వయంతో అక్రమ రవాణాను అరికట్టేందుకు వీలుంటుందని అన్నారు. అనుమతులు ఒకచోట పొంది మరొకచోట తీస్తే తాసిల్దారు నిలుపుదల చేసి కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అనుమతులు పొందినప్పటినుంచి. 60 రోజుల సమయం పూర్తి కాగానే మళ్లీ అవసరం ఉంటే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మైనింగ్ చట్టం ప్రకారం గుప్పెడు మట్టి తీసుకునేందుకు కూడా అనుమతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో కానీ. కుంటలు చెరువులు, నదులలోను అనుమతులు ఉంటేనే తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు.

44వ జాతీయ రహదారి వెంట రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నందున అనుమతుల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు వారు తెలిపారు. హైదరాబాదు డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ అధికారి పర్యవేక్షణ తో అనుమతులు లభిస్తాయని తెలిపారు. గట్లు. కొండలు వాటికి అనుమతులు హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ వారు టెండర్ ద్వారా అప్పగిస్తారని గద్వాల గట్ల. గుట్టలకు టెండర్ వేసిన ఎవరు ముందుకు రాలేదని వారు సూచించారు. గుట్టలకు కొండలకు అనుమతులు పొందిన వారు. 20  సంవత్సరాలు వరకు అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుదినిర్ణయము పై స్థాయి అధికారుల పైన ఆధారపడి ఉంటుందని ఈ మధ్యకాలంలో గద్వాల్ మైనింగ్ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినట్లు రెగ్యులర్గా వనపర్తి మైనింగ్ అధికారిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State