సాతర్లగ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని సాతర్ల గ్రామపంచాయతీ లో సర్పంచ్ అం చమ్మ రాజేష్ ఆధ్వర్యంలో సాతర్ల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అం చమ్మ రాజేష్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డులతో రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రేషన్ తీసుకునే సౌకర్యం కలుగుతుంది. డిజిటల్ వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయి. "ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాము" అని * సర్పంచ్ అం చమ్మ రాజేష్. తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజు,జిపిఓ ఈశ్వరయ్య, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ అంగన్వాడీ టీచర్లు వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.