సేవా స్ఫూర్తి జాతీయ కీర్తి జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవం

Sep 24, 2024 - 20:04
Sep 25, 2024 - 10:20
 0  31
సేవా స్ఫూర్తి జాతీయ కీర్తి జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవం

సేవా స్ఫూర్తి - జాతీయ కీర్తి

కె. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవం (NSS DAY)వేడుకలను ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎస్ చైర్పర్సన్ ఎన్. రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా "నాకోసం కాదు - మీకోసం" అనే నినాదంతో... 

విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా, సేవలో భాగస్వాములైన వారికి మానవీయ విలువలు నేర్పి, సమాజం పట్ల బాధ్యతను పెంచి, ఆత్మవిశ్వాసాన్ని, సేవా దృక్పథాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఎన్.ఎస్.ఎస్ కార్యకర్తగా ఉన్న విద్యార్థి సామాజిక కార్యకర్తగా, సమర్థవంతమైన నిర్వాహకునిగా, నాయకునిగా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, ఆత్మస్థైర్యంతో ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా తయారవుతారని అన్నారు.

ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రతి విద్యార్ధి గ్రామాలలో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతూ, ప్రజలకు మూడవిశ్వాసాలపై అవగాహన కలుగజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటే విధంగా ప్రచారం చేస్తూ... యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, శ్రమదానం చేస్తూ అందరూ కలిసికట్టుగా జీవించాలని పిలుపునిచ్చారు.

ఎన్.ఎస్.ఎస్ డే సందర్భంగా పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య,ఆర్. పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, వి.బల భీమారావు, ఆర్.రమేష్ శర్మ, బి.రమేష్ బాబు, జి.వెంకట రెడ్డి, పి.తిరుమల, యస్.గోపి కృష్ణ, యం.చంద్రశేఖర్,యస్. కె ముస్తఫా, నరసింహారెడ్డి, కె.శాంతయ్య, అన్వేష్, ఆర్. చంద్రశేఖర్ గౌడ్,యస్. వెంకటాచారి, టి.మమత, డి.ఎస్. రావు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State