సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను ఆకస్మికంగ తనిఖీ చేసిన DMHO సంధ్యా కిరణ్మయి
— మందుల నిల్వలు, రికార్డులు, పంపిణీ ప్రక్రియపై సమగ్ర పరిశీలన.
జోగులాంబ జ్వాలా 9 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను ఆకస్మికంగ తనిఖీ చేశారు. ఈ సందర్భంగ మెడిసిన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మందుల నిల్వలు, వాటి భౌతిక స్థితి, రికార్డుల నిర్వహణ, మందుల ఇండెంట్ మరియు పంపిణీ ప్రక్రియను ఆమె క్షుణ్ణంగ పరిశీలించారు.
తనిఖీలో భాగంగ స్టాక్ రిజిస్టర్లు, ఇండెంట్ రిజిస్టర్లు, మందుల పంపిణీకి సంబంధించిన రికార్డులు తదితరాలను పరిశీలించి, రికార్డుల్లో నమోదైన వివరాలకు, స్టోర్‌లో ఉన్న భౌతిక నిల్వలకు సరిపోలుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. మందుల నిల్వలు, వినియోగం మరియు పంపిణీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో సక్రమంగ నమోదు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
అలాగే మందులు అవసరమైన ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఇతర ఆరోగ్య సంస్థలకు అవసరానికి అనుగుణంగ, నిర్ణీత విధానాల ప్రకారం మందుల సరఫర జరిగేల చూడాలని ఆదేశించారు. మందుల నిల్వలలో కొరత ఏర్పడకుండ ముందస్తు ప్రణాళికతో ఇండెంట్లు సిద్ధం చేసుకోవాలని, అత్యవసర మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
స్టోర్‌లో మందుల కాలపరిమితి (Expiry Date), బ్యాచ్ నంబర్లు, నిల్వ విధానం తదితర అంశాలను కూడ పరిశీలించారు. కాలపరిమితి సమీపిస్తున్న మందులను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటి వినియోగం, పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మందుల నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత, క్రమబద్ధమైన అమరిక, భద్రత ప్రమాణాలను తప్పనిసరిగ పాటించాలని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు మరియు ఇతర ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మందులు సకాలంలో అందుబాటులో ఉండటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల మందుల నిల్వలు మరియు పంపిణీ వ్యవస్థలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండ బాధ్యతాయుతంగ విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగ ఆమే వెంట ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసూనరాణి మరియు జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ నరేందర్ బాబు ఉన్నారు.