సూర్యాపేట మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26000/- ఇవ్వాలని

Apr 22, 2026 - 19:21
Apr 22, 2026 - 19:22
 0  1
సూర్యాపేట మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26000/- ఇవ్వాలని

సూర్యాపేట, 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మార్చి నెల వేతనం విడుదల చేయాలని గత నాలుగు సంవత్సరాలనుండి పెండింగ్ లో ఉన్న యూనిఫామ్, నూనె, సబ్బులు, చెప్పులు ఇవ్వాలని  నైట్ డ్యూటీ వర్కర్స్ అందరికి వేయాలని 2 నెలలకు 3నెలల కే నైట్ డ్యూటీ వేస్తున్నారని, చాలా మంది మహిళల కు ఆరోగ్య రీత్యా గర్భసంచి ఆఫిరేషన్ జరగడం వలన 300 వరకు మట్టి కుప్పలు ఎత్తడం మూలంగా అనారోగ్యం వస్తుందని తదితర డిమాండ్ల పై ఈ రోజు మున్సిపల్ కమీషనర్ హనుమంత రెడ్డి గారిని కలిసి Brtu సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి. గురూజీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా గురూజీ సమస్య లు వివరిస్తూ విలీన గ్రామాల వర్కర్స్ కొందరికి, 80 మంది కాంట్రాక్టు వర్కర్స్ కు PF, ESI అమలు చేయాలని కోరారు, కొందరు యూనియన్ నాయకులు PF ఇప్పిస్తామని కార్మికులనుండీ వేలాది రూపాయలు వసూల్ చేస్తున్న విషయం కమీషనర్ దృష్టిలో ఉన్నదని, డబ్బులు వసూల్ చేసిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకుంటామని అన్నారు. కార్మికుల వేతనం నుండి కట్ చేసిన PF డబ్బులు కమీషనర్ అకౌంట్ లో ఉన్నాయని తక్షణమే అట్టి డబ్బులు తిరిగి కార్మికులకు ఇవ్వాలని గురూజీ అన్నారు. అన్ని సమస్య లు పరిష్కారం చేస్తానని కమీషనర్ హామీ ఇచ్చినారు. కమీషనర్ గారిని కలిసిన వారిలో యూనియన్ నాయకులు వేంకటాద్రి, డేవిడ్, శ్వేతా, బక్కమ్మ, కళమ్మ, కుమారి తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333