సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన
మాజీ మంత్రివర్యులు రాo రెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి.
మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి
వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.