సూర్యాపేట జిల్లా బి.ఆర్.యస్ నాయకులు ఉటుకూరి సైదులు పితృవియోగం
పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్
పాస్టర్ ఉటుకూరి రాజు
సోమవారం 12 మే : ఈరోజు స్థానిక చివ్వేంల మండల కేంద్రం మోదింపురం గ్రామంనకు చెందిన బి ఆర్ యస్ పార్టీ సూర్యాపేట జిల్లా నాయకులు, మాజీ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ప్రస్తుత హైకోర్ట్ న్యాయవాది ఉటుకూరి సైదులు తండ్రి కీ. శే. ఉటుకూరి జానయ్య (85) అకాల మరణం కుటుంబనికి తీరని లోటు అనీ తెలిపారు.ఆయనకు భార్య ఉటుకూరి లక్ష్మమ్మ, కుమారులు సైదులు, నాగేశ్వరావు, ప్రసాద్, కూతుళ్లు యశోద, వినోద, శోభారాణి, తమ్ముడు యెసుదాసు వారిని క్రైస్తవ రాష్ట్ర నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ పారమర్శించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమం లో పీపుల్ పౌండేషన్ చైర్మన్ యాతకుల సునీల్, యం. ఆర్. పి.యస్ రాష్ట్ర నాయకులు దుబ్బ రమేష్, యం. ఆర్. పి. యస్.సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్, యాదాసు గోపి, కత్తి వెంకన్న పాస్టర్ ఉటుకూరి రాజు, రెవ. ఏర్పుల క్రీస్థోఫర్, పాస్టర్ బాణాల సైమన్ తదితరులు పాల్గొన్నారు