సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు అందుబాటులోకి మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్.
ప్రారంభించిన ఎస్పీ నరసింహ
సాంకేతిక పద్దతుల్లో కేసుల దర్యాప్తు.
సంఘటన స్థలం నుండే వేగంగా ఫోరెన్సిక్ ఆదారాల సేకరణ.
నిందితులు తప్పించుకోకుండా త్వరగా గుర్తింపు.
సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.
సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు మరో అత్యాధునిక సాంకేతిక వాహనం (మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్) అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు శాఖ కేటాయించిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ పోలీసు అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారం అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ఈ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ద్వారా సంఘటనా స్థలం నుండే నేరుగా ఫోరెన్సిక్ ఆధారాలను వేగంగా సేకరించవచ్చని తెలిపారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం ద్వారా నిందితులను త్వరగా గుర్తించవచ్చని, వారు చట్టం నుండి తప్పించుకోకుండా కఠిన శిక్షలు పడేలా చేయవచ్చని ఎస్పీ గారు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బీ డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.