సూర్యాపేట జిల్లా కేంద్రం  పాత మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి

May 30, 2025 - 19:11
 0  2
సూర్యాపేట జిల్లా కేంద్రం  పాత మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి

జర్నలిస్టు భవనం నిర్మించేంతవరకు పోరాటం ఆగదు

అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందించిన

టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలని కోరుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్ జే ఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి శుక్రవారం వినతి పత్రం అందించారు.శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రసంగించిన అనంతరం యాదగిరి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ప్రత్యేక వినతిని తెలిపారు.ఎంతో చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్టులకు పక్కా భవనం లేక చెట్ల కింద ప్రైవేటు భవనాల కింద టీ స్టాల్ వద్ద హోటల్లో గడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో కూడిన పక్క భవనాన్ని 500 గజాల స్థలాన్ని కేటాయించి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉంటే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పక్క జనరల్ ఇంకా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైన సంగతి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు అధికారులు మర్చిపోవద్దన్నారు. అదేవిధంగా సూర్యాపేటలో ఉన్న అన్ని యూనియన్ల జర్నలిస్టులు అంతరంగిక సమస్యలన్నీ పక్కన పెట్టి జర్నలిస్టు భవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333