సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి హృదయపూర్వక అభినందనలు

Jun 16, 2026 - 20:49
 0  2
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి హృదయపూర్వక అభినందనలు

సూర్యాపేట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌గా విధులు స్వీకరించి విజయవంతంగా రెండేళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవనీయులు తేజస్ నందలాల్ పవార్, నీ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే జానీమియా, దున్న శ్యామ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాలకు అనుగుణంగా, అలాగే జిల్లా మంత్రివర్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో సూర్యాపేట జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల కల్పన మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కలెక్టర్ విశేష కృషి చేశారనీ తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంకితభావం, పరిపాలనలో సమర్థ నాయకత్వంతో జిల్లా ప్రజల మన్ననలు పొందిన కలెక్టర్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయిని ఆకాష్ వర్మ, డి బాలు, రాంబాబు, అల్లి సతీష్ వెంకటేశ్వర్లు, ఆదిమల్ల శ్రీనివాస్ నందిపాటి రవి, పోకల శ్రీనివాస్ మత్స్యగిరి మరియు కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొని కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

బై

తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్
సూర్యాపేట జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333